Janaka Aithe Ganaka Release Trailer : సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్.. నవ్వులే నవ్వులు..
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్.

Janaka Aithe Ganaka Release Trailer out now
Janaka Aithe Ganaka Release Trailer : వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్. ఆయన నటిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.
దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సంగీర్తన కథానాయికగా నటిస్తుండగా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Bigg Boss 8 : 6వ వారం నామినేషన్స్‌లో ఉంది ఎవరంటే? ఏడ్చేసిన నయని పావని.. సారీ చెప్పిన తేజ..
ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మిడిల్ క్లాస్ యువకుడు (సుహాస్) పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువవుతాయని పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పిల్లలు కావాలనుకుంటారు.
సడెన్‌గా అతడి భార్య గర్భవతి అంటూ చెబుతంది. తాను వాడిన కండోమ్ వలనే ఇలా అయ్యిందంటూ నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. ఈ కేసు సుహాస్ జీవితంలో ఎలాంటి ములుపు తీసుకువచ్చింది. ఆ కేసు గెలిచాడా? లేదా? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
Nayanthara : ఆమె పిల్లల ఆయాల ఖర్చు నిర్మాతలు ఎందుకు భరించాలి? నయనతారపై యూట్యూబర్ అంతనన్ విమర్శలు!