Bigg Boss 8 : 6వ వారం నామినేషన్స్‌లో ఉంది ఎవరంటే? ఏడ్చేసిన నయని పావని.. సారీ చెప్పిన తేజ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో వారం కొనసాగుతోంది.

BIGG BOSS 8 Telugu sixth week nominations completed
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూరైంది. ఓజీ క్లాన్ నుంచి యష్మీ, సీత, విష్ణు ప్రియ, పృథ్వీలు నామనేట్ అయ్యారు. ఇక ఓజీ క్లాన్ అంతా కలిసి రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించాడు.
రాయల్ క్లాన్ తమ వద్ద ఉన్న షీల్డ్ ను నయని పావనికి ఇచ్చారు. ఇక ఓజీ క్లాన్ అంతా చర్చించుకుని మెహబూబ్, గంగవ్వలను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం యష్మి, విష్ణు ప్రియ, సీత, పృథ్వీ, గంగవ్వ, మెహబూబ్ లు నామినేట్ అయ్యారు.
Nayanthara : ఆమె పిల్లల ఆయాల ఖర్చు నిర్మాతలు ఎందుకు భరించాలి? నయనతారపై యూట్యూబర్ అంతనన్ విమర్శలు!
ఇక నామినేషన్స్ అయిపోయిన తరువాత యష్మీకి గౌతమ్ ఓ సూచన ఇచ్చాడు. మణితో గొడవ తగ్గించుకోవాలని, అది బయటికి వేరేలా పోతుందని సలహా ఇచ్చాడు. ఇక గంగవ్వతో కలిసి విష్ణు, తేజ ముచ్చట్లు నవ్వించాయి. పెళ్లి టాఫిక్ రాగా.. తేజని చేసుకో అంటూ విష్ణుని ఆటపట్టించింది గంగవ్వ. నాలాగా డ్యాన్స్, పుష్ అప్స్ చేస్తాడా అని విష్ణు అంది.
రేషన్ కోసం నబిల్, నిఖిల్ వెళ్లారు. అన్ని తీసుకుని వచ్చారు కానీ ఉప్పు ప్యాకెట్ మరిచిపోయారు. ఉప్పు ప్యాకెట్ కావాలని బిగ్‌బాస్‌ను కోరగా అందుకు యాభై వేలు అవుతుందని, ఆ మొత్తం ప్రైజ్‌మనీ నుంచి కట్ అవుతుందని చెప్పాడు.
మరోవైపు సీత, అవినాష్, నయని కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తేజ కాస్త నోరు జారారు. దీంతో పావని ఏడ్చింది. ఆఖరికి తేజ వెళ్లి నయనికి క్షమాపణలు చెప్పాడు.