Rajinikanth : ఆయనే నాకు రోల్ మోడల్.. అమితాబ్‌ను చూసి చాలా నేర్చుకున్నా.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Rajinikanth : వేట్టెయాన్ ఆడియో లాంచ్‌లో రజనీకాంత్.. తన జీవితాన్ని అమితాబ్ ఎంతగా ప్రభావితం చేశారు అనేది గుర్తు చేసుకున్నారు. బిగ్ బి గురించి ఒక విషయం చెప్పాలంటూ.. నేటి తరం పిల్లలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చునని చెప్పుకొచ్చారు.

Rajinikanth : ఆయనే నాకు రోల్ మోడల్.. అమితాబ్‌ను చూసి చాలా నేర్చుకున్నా.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Amitabh Bachchan lived alone in Switzerland for Two years

Updated On : October 8, 2024 / 11:48 PM IST

Rajinikanth Amitabh Bachchan : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ నటులే కాదు.. మంచి మిత్రులు కూడా. ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు.. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అందులో హిందీ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. కానీ, ఇప్పటివరకూ అమితాబ్ తమిళంలో నటించలేదు. అలాంటి అవకాశం వచ్చిన పలుసార్లు అది ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో సినిమాలు అవకాశం వచ్చిన బిగ్ బికి తమిళంలో ఎంట్రీకి ముహర్తం కుదరలేదు. కానీ, ఇప్పుడు అది జరగబోతుంది.

Read Also : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ రాజకీయ రచ్చ.. ప్రైవేటీకరణ లేదంటూనే తెరవెనక ఈ వ్యవహారం ఏంటి?

తమిళంలో వెట్టెయాన్‌తో అమితాబ్ అరంగేట్రం :
అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాతో అమితాబ్ అరంగ్రేటం చేయనున్నారు. ‘వేట్టయాన్’ మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో తమిళంలో బిగ్ బి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రత్యేకించి ఎస్‌జే సూర్య దర్శకత్వంలో ఉయర్ంధ మనిధన్‌తో అమితాబ్ తమిళంలో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, అప్పటికే బిగ్ బి తెలుగులో సైరా నరసింహా రెడ్డి, కల్కి 2898 ఏడీ వంటి మూవీలో నటించి అరంగేట్రం చేశారు.

చాలా ఏళ్ల తర్వాత తన స్నేహితుడైన రజనీకాంత్ నటించిన చిత్రంతో తమిళంలో అమితాబ్ అరంగేట్రం చేయనున్నారు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ జంటగా తెరకెక్కిన నాల్గవ చిత్రం కానుంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన వేట్టయాన్ మూవీ. వీరిద్దరి కాంబినేషన్‌లో అంధా కానూన్, జిరాఫ్తార్, హమ్ అనే మూడు హిందీ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇప్పుడు తమిళంలో తెరకెక్కించే వేట్టయాన్ మూవీతో ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది.

బిగ్ బిపై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు :
ఇటీవల జరిగిన వేట్టెయాన్ ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ తన జీవితాన్ని అమితాబ్ ఎంతగా ప్రభావితం చేశారు అనేది గుర్తు చేసుకున్నారు. “అంధా కానూన్ అనే హిందీ మూవీ మా తమిళ సత్తం ఒరు ఇరుత్తరైకి రీమేక్. మొదట ఈ మూవీలో మిథున్ చక్రవర్తి నటించారు. అయితే, అమితాబ్ మాత్రం ఈ మూవీలో రజనీకాంత్ నటించాలని కోరారట.. అలా ఇద్దరి కాంబినేషన్‌లో జిరాఫ్తార్, హమ్ అనే రెండు బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నారు. ఇదే విషయాన్ని రజనీ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ గురించి ఒక విషయం చెప్పాలంటూ.. నేటి తరం పిల్లలకు బిగ్ బి గురించి పెద్దగా తెలియకపోవచ్చు” అని రజనీకాంత్ అన్నారు. తనకు అమితాబ్‌ ఎందుకు రోల్ మోడల్‌గా అనుకుంటున్నారో కూడా సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు.

రెండేళ్లు స్విట్జర్లాండ్‌లో ఒంటరిగా గడిపారు :
“అమితాబ్ కెరీర్ పీక్‌లో ఉండగా.. ఆయన 57-58 ఏళ్ల వయస్సులో చాలా విసుగు చెందాడు. స్విట్జర్లాండ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ కొనుక్కుని ఒంటరిగా గడిపారు. అన్నీ ఒక్కడే చేశాడు. అది చూసి బెంగుళూరులో కూడా ట్రై చేశాను. కానీ, అమిత్ ఒక ఏడాది లేదా రెండు ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆయన ఏబీసీఎల్ ప్రారంభించాడు. వివిధ భాషల్లో మంచి సినిమాలు చేయాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇది సినిమా పరిశ్రమలో ప్రతిఒక్కరికి ఎదురయ్యే చేదు వాస్తవం. జాగ్రత్తగా ఉండకుంటే నువ్వు అయిపోతావు” అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

అమితాబ్ నుంచి చాలా నేర్చుకున్నా :
“నేను అమితాబ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనే నా రోల్ మోడల్. ఆయన డబ్బు పోగొట్టుకున్నప్పుడు.. అప్పుల బాధతో ఆయన పతనం చూసి అనేక మంది సంబరాలు చేసుకున్నారు. మీరు పై స్థాయికి ఎదిగినప్పుడు.. మీరు పడిపోతారని చాలా మంది ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు.. మీరు పడిపోయే వరకు వారు వేచి ఉండరు. చిన్నపాటి స్లిప్ వచ్చినా సంబరాలు చేసుకుంటారు. ఇంకా, 65ఏళ్ల విఫలమైన తర్వాత ఆయన మళ్లీ పైకి ఎదిగారు.

ఆయన ప్రతి సవాలును స్వీకరించాడు. తనకు తానుగా నిలబడ్డాడు. ఇప్పుడు కూడా 82 ఏళ్ల వయస్సులో, ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తాడు. జిమ్‌లో తన రోజును కిక్‌స్టార్ట్ చేస్తాడు. మీరు కింద పడినప్పుడు మీపై నిందలు వేసేందుకు వేచి ఉన్నవారు ఉంటే.. మీరు లేచి నిలబడి.. మిమ్మల్ని కిందకి దింపిన వ్యక్తులపై గెలిచి చూపించాలి.. అలా తిరిగి పైకి ఎదగాలి. అదే అమితాబ్.. ఆయన వెట్టయన్‌లో నాతో కలిసి నటించడం చాలా సంతోషకరమైన క్షణం” అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

Read Also : Geoffrey Hinton Nobel Prize : మెషిన్ లెర్నింగ్‌లో ఆవిష్కరణలు.. ఏఐ గాడ్ ఫాదర్ జియోఫ్రీ ఇ.హింటన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్ పురస్కారం..!