Nayanthara : ఆమె పిల్లల ఆయాల ఖర్చు నిర్మాతలు ఎందుకు భరించాలి? నయనతారపై యూట్యూబర్ అంతనన్ విమర్శలు!
Nayanthara: నిర్మాత, యూట్యూబర్ అంతనన్ నయనతారపై మండిపడ్డారు. తన పిల్లలను చూసే ఇద్దరు నానీలను ఆమె సెట్స్‌కు తీసుకువస్తోందని, వారి ఖర్చులను నిర్మాతలు భరించాలని భావిస్తున్నారని ఆరోపించారు.

Why producers Should pay for Nayanthara children's nannies
Nayanthara : సౌత్ ఇండియా సినిమాలో బ్యూటీ నయనతార క్రేజే వేరు. విలక్షణ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. పాపులర్ నటీమణులలో ఒకరిగా ఎదిగింది. అయితే, నయనతార సినీప్రయాణంపై విమర్శలు తప్పలేదు. ఆమె వ్యక్తిగత జీవితంతోపాటు, సినీకెరీర్ గురించి ఏదో విషయంలో ఎవరో ఒకరి నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత, యూట్యూబర్ అంతనన్ కూడా నయన్‌పై విమర్శలు గుప్పించారు.
ఆమె వ్యవహారశైలికి సంబంధించి అనేకసార్లు పలువురు నిర్మాతలు సైతం అసంతృప్తిని వెలిబుచ్చారు. గతంలో నయనతార 8 మందితో కలిసి సినిమా సెట్స్‌పైకి వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో యూట్యూబర్ అంతనన్ కూడా నయనతారపై మండిపడ్డారు. ఆమె ఇప్పుడు తన పిల్లలను చూసే ఇద్దరు నానీలను సెట్స్‌కు తీసుకువస్తోందని, వారి ఖర్చులను కూడా నిర్మాతలు భరించాలని భావిస్తున్నారని ఆరోపించారు.
“నయనతార తన పిల్లల కోసం ఇద్దరు ఆయాలతో షూటింగ్ లొకేషన్‌లకు వస్తుంది. వారికి కూడా డబ్బు చెల్లించాలని నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు. అందులో జస్టిఫికేషన్ ఎక్కడ ఉంది? ఆమె తన పిల్లల కోసం నానీలను తీసుకువస్తే.. వారికి చెల్లించాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు.. తమిళ యూట్యూబ్ ఛానెల్ ‘ది విజిల్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతనన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూట్యూబర్ అక్కడితో ఆగలేదు. నయనతార తన జీవితంలోని వ్యక్తిగత అంశాలపై కూడా డబ్బు ఆర్జించడానికే చూస్తారంటూ విమర్శించాడు. ఆమె తన పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్‌కి భారీ మొత్తానికి అమ్మేసింది. నయనతార ప్రతిదీ వ్యాపారంగా మార్చుకుంది. నయనతారను అంతనన్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు.
అంతకుముందు, నటి ప్రతి చిత్రానికి రూ. 12 కోట్లు వసూలు చేస్తుందని, తన సినిమాలు బాగా ఆడనప్పుడు ఇంత ఎక్కువ ఫీజు ఎందుకు సమర్ధిస్తారని ప్రశ్నించారు. తన నటనా వృత్తిని దాటి, నయనతార చలనచిత్ర నిర్మాణం, అనేక ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టింది.
Read Also : Rajinikanth : ఆయనే నాకు రోల్ మోడల్.. అమితాబ్‌ను చూసి చాలా నేర్చుకున్నా.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!