Dark Chocolate Benefits : ప్రతిరోజూ కొద్దిగా డార్క్ చాక్లెట్ తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
Dark Chocolate Health Benefits : డార్క్ చాక్లెట్ తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు ఆందోళన వంటి సమస్యలను నివారించవచ్చు.

Eating Dark Chocolate Every Day Get More Health Benefits ( Image Source : Google )
Dark Chocolate Health Benefits : డార్క్ చాక్లెట్.. ఈ పేరు వినగానే నోరూరిపోతుంది కదా.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే ఉంటాయి మరి. అందుకే ప్రతిరోజూ ఒక డార్క్ చాక్లెట్ తినాలంటున్నారు సైంటిస్టులు.. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని చెబుతున్నారు. డార్క్ చాక్లెట్‌తో కలిగే ప్రయోజనాల గురించి అనేక అధ్యయనాలు ఇదే సూచిస్తున్నాయి.
ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లోని అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. దీని ప్రకారం.. డార్క్ చాక్లెట్ తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ నుంచి మరణ ముప్పును దాదాపు 50 శాతం తగ్గించవచ్చు. అంతేకాదు.. కనీసం వారానికి ఒకసారి డార్క్ చాక్లెట్ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా బాగా మెరుగుపడుతుందని తేలింది.
మానసిక సమస్యలకు డార్క్ చాక్లెట్ బెస్ట్ :
డార్క్ చాక్లెట్ తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు ఆందోళన వంటి సమస్యలను నివారించవచ్చు. మానసికంగా ఎంతో ఆనందాన్ని కూడా పొందవచ్చునని అధ్యయనం తేల్చింది. డార్క్ చాక్లెట్‌లో ఫెనిలేథైలమైన్ వంటి సైకోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. వీటిలో మానసిక స్థితిని నియంత్రించే న్యూరోమోడ్యులేటర్ ఉంటుది. చాక్లెట్ తినేవారిలో చాలా కాలం తర్వాత మానసిక స్థితి మెరుగుపడినట్టు గుర్తించారు.
డార్క్ చాక్లెట్‌తో గుండెజబ్బులకు చెక్ :
గతంలో డార్క్ చాక్లెట్ ప్రయోజనాలపై 30కి పైగా అధ్యయనాలు నిర్వహించారు. వీటి ప్రకారం.. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తినే వారిలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు.. బరువు, శరీర కొవ్వు కూడా తగ్గినట్టు గుర్తించారు.
మూడ్-బూస్టింగ్ అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్ రోజుకు అర ఔన్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ మొత్తానికి మించి తీసుకున్నా పెద్దగా ప్రభావం కనిపించలేదు. అలాగే, గుండె సంబంధ వ్యాధుల నివారణ అధ్యయనంలో కూడా 0.7 నుంచి 1.5 ఔన్సుల మధ్య తీసుకున్నారు.
కొన్ని డార్క్ చాక్లెట్‌లు రుచికి బాగుంటాయి. వీటిలో 40 శాతం కోకో సాలిడ్‌లు ఉంటాయి. అందుకే డార్క్ చాక్లెట్ డార్క్‌గా కనిపించడానికి కారణంగా చెప్పవచ్చు. అధ్యయనాల్లో కనీసం 60 శాతం కోకో ఘనపదార్థాలను కలిగిన డార్క్ చాక్లెట్ నుంచి అతిపెద్ద ప్రయోజనాలను పొందవచ్చునని తేలింది. కార్డియోవాస్కులర్ అధ్యయనంలో పాల్గొనేవారు 70 శాతం డార్క్ చాక్లెట్‌ను ప్రతిరోజూ తీసుకున్నారు.
వారిలో మానసికపరమైన రుగ్మతల్లో అనేక మార్పులు వచ్చినట్టుగా గుర్తించారు. ఎప్పుడూ టెన్షన్‌గా ఉండే వారు రోజులో ఒకసారైనా లేదా వారానికి ఒకసారైన ఒక డార్క్ చాక్లెట్ తినడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి.