Free LPG Cylinder : మహిళలకు గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా ఫ్రీ ఎల్పీజీ సిలిండర్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!
Free LPG Cylinder : ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందేందుకు మహిళలు ఈ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడ తెలుసుకుందాం.

Ujjwala Yojana _ How To Apply for free LPG cylinder before Diwali ( Image Source : Google )
Free LPG Cylinder : మహిళలకు గుడ్ న్యూస్.. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేదా? అయితే, ఇది మీకోసమే.. కేంద్రం ప్రభుత్వం దీపావళి కానుకగా మహిళల కోసం కొత్తగా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. ఈ దీపావళి రోజున ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేయనుంది. దీపావళికి ముందే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా లబ్ధిదారులందరూ సకాలంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ఏంటి? :
గ్రామంలోని ప్రతి ఇంట్లో మహిళలకు గ్యాస్ అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. తద్వారా మహిళలు సులభంగా గ్యాస్‌తో ఆహార పదార్థాలను వండుకోవచ్చు. నిజానికి నేటికీ గ్రామంలోని అనేక ఇళ్లలో మహిళలు అనేక సౌకర్యాలు పొందలేకపోతున్నారు.
కట్టెల పొయ్యిపై వంటలు వండటం ద్వారా వచ్చే పొగ వల్ల చాలా మంది స్త్రీలకు అనేక రకాల కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను తీసుకొచ్చింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందేందుకు మహిళలు ఈ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడ తెలుసుకుందాం.
- అధికారిక వెబ్సైట్ (www.pmuy.gov.in)కి వెళ్లండి.
- మీరు హోమ్ పేజీలో డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- అనేక లాంగ్వేజీ ఫారమ్‌లు ఉంటాయి. మీ లాంగ్వేజీ ఫారమ్‌ను ఎంచుకోండి.
- మీరు ఈ ఫారమ్‌ను ఎల్పీజీ సెంటర్ నుంచి కూడా పొందవచ్చు.
- ఆ తర్వాత, ఫారమ్ ప్రింట్ తీసుకొని మొత్తం సమాచారాన్ని నింపండి.
- మీరు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి.
- మీరు సమీప ఎల్పీజీ సెంటర్లో ఫారమ్‌ను సమర్పించాలి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తారు.
పథకం ప్రయోజనాలేంటి? :
- లబ్ది పొందిన మహిళ వయస్సు 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండాలి.
- మహిళకు ఇప్పటికే ఎలాంటి ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు.
- లబ్ధిదారుడు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి.
- లబ్ధి పొందిన మహిళ దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలివే :
- కుల ధృవీకరణ పత్రం
- బీపీఎల్ రేషన్ కార్డు
- ఆధార్ కార్డ్
- మొబైల్ నంబర్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- నివాస ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో
ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది :
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిలిండర్‌ను అందజేస్తున్నారు. అంతేకాదు.. సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా పొందవచ్చు.