Vi Subscription Plan : సినిమా లవర్స్‌కు పండగే.. వోడాఫోన్ ఐడియా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఇదిగో.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Vi Subscription Plan : వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌లు 15కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. తద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ షోలు, మూవీలు, స్పోర్ట్స్‌ని ఎప్పుడైనా వీక్షించవచ్చు.

Vi Subscription Plan : సినిమా లవర్స్‌కు పండగే.. వోడాఫోన్ ఐడియా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఇదిగో.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Vi Launches New Subscription Plan For Vi Movies

Updated On : October 8, 2024 / 5:16 PM IST

Vi Subscription Plan : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యంగా సినిమా లవర్స్ కోసం వోడాఫోన్ ఐడియా సూపర్ ప్యాక్ తీసుకొచ్చింది. ఈ అద్భుతమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధర ఎంతో తెలుసా? కేవలం రూ. 175 మాత్రమే.. ఈ ఆఫర్ పొందడం ద్వారా వివిధ రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆప్షన్లను పొందవచ్చు.

Read Also : iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

ప్రధానంగా ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఈ సూపర్ ప్యాక్‌ ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌లు 15కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. తద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ షోలు, మూవీలు, స్పోర్ట్స్‌ని ఎప్పుడైనా వీక్షించవచ్చు. అదనంగా, ప్లాన్‌లో 10జీబీ డేటా కూడా పొందవచ్చు. మీరు ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా కంటెంట్ స్ట్రీమింగ్‌ను ఈజీగా యాక్సస్ చేయొచ్చు.

ఈ సూపర్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా సోనీలైవ్, జీ5, మనోరమమ్యాక్స్, ఫ్యాన్‌కోడ్, ప్లేఫ్లక్స్ సహా అనేక రకాల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా వినియోగదారులు మూవీలు, టీవీ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల లైబ్రరీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ పొందవచ్చు. థ్రిల్లింగ్ డ్రామాలు లేదా లైవ్ స్పోర్టింగ్ ఈవెంట్‌లను ఇష్టపడే యూజర్లు సూపర్ ప్యాక్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.

సూపర్ ప్యాక్ ప్లాన్లు, బెనిఫిట్స్ ఇవే :
బోనస్ ఆఫర్‌లో భాగంగా రూ. 449 లేదా రూ. 979 ధరలో (Vi Hero) అన్‌లిమిటెడ్ ప్యాక్‌లతో అందిస్తోంది. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఈ సూపర్ ప్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ రెండు అన్‌లిమిటెడ్ ప్యాక్‌లపై అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాను అందిస్తాయి.

కస్టమర్‌లు తమకు ఇష్టమైన కంటెంట్‌ను సులభంగా యాక్సస్ చేయొచ్చు. అంతేకాదు..రాత్రిపూట 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ వంటి ప్రత్యేకమైన డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. వినియోగదారులు తాము ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు ఫార్వర్డ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త సూపర్ ప్యాక్ ప్లాన్ ప్రీమియం కంటెంట్‌కు సరసమైన ధరలో కోరుకునే యూజర్లకు గేమ్-ఛేంజర్ అని చెప్పవచ్చు. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా సర్వీసులను పొందడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు ఈ సూపర్ ప్యాక్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Read Also : Vivo Y300 Plus Leak : వివో Y300 ప్లస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?