TVS Radeon 110 Launch : భలే ఉంది భయ్యా ఈ బైక్.. టీవీఎస్ రేడియన్ లుక్ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
TVS Radeon 110 Launch : కొత్త బైక్ కొంటున్నారా? అయితే ఇప్పుడే త్వరపడండి.. టీవీఎస్ నుంచి కొత్త రేడియన్ బేస్ మోడల్ బైక్ వచ్చేసింది. బేస్, డీజీ డ్రమ్, డీజీ డిస్క్ మొత్తం 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

TVS Radeon 110 New Base Variant Launched
TVS Radeon 110 Launch : కొత్త బైక్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ ఇండియా కొత్త బైక్ తీసుకొచ్చింది. ఇటీవలే టీవీఎస్ రేడియన్ (Radeon) కమ్యూటర్ మోటార్‌సైకిల్ బడ్జెట్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ బేస్ మోడల్ పూర్తిగా బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది.
ఈ కొత్త బైక్ ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు కొనుగోలు చేయొచ్చు. గత ధర కన్నా రూ.2,525 తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా, ఈ బేస్ వేరియంట్ మిడ్-టైర్ ఆప్షన్ కన్నా రూ. 17,514 తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. రేడియన్ 110 బేస్ మోడల్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
రేడియన్ బైక్ ఇప్పుడు మొత్తం 3 వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో బేస్, డీజీ డ్రమ్, డీజీ డిస్క్ ఉన్నాయి. డిజైన్ టీవీఎస్ రేడియన్ లేటెస్ట్ బేస్ వేరియంట్ కాంట్రాస్ట్ ఇంజన్ కవర్‌తో ఆల్-బ్లాక్ పెయింట్ జాబ్‌ను కలిగి ఉంది. టీవీఎస్ రేడియన్ లోగోలు ప్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై ఉంటాయి. ఈ మార్పులు కాకుండా, బైక్ ఒరిజినల్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. కొత్త ఆల్-బ్లాక్ ఆప్షన్‌తో సహా 7 విభిన్న కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.
ఇంజిన్, స్పెసిఫికేషన్లు :
టీవీఎస్ రేడియన్ 109.7సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 7350 ఆర్పీఎమ్ వద్ద 8.08bhp, 4500 ఆర్పీఎమ్ వద్ద 8.7Nm టార్క్‌ను అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బైక్ నిర్మాణంలో ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ ట్విన్ షాక్‌లతో కూడిన సింగిల్ క్రెడిల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఉన్నాయి.
బ్రేకింగ్ సిస్టమ్ :
టీవీఎస్ రేడియన్‌లోని బ్రేకింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చాలా వేరియంట్‌లకు 130ఎమ్ఎమ్ ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. అయితే, టాప్ వేరియంట్‌లో 240ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు 110ఎమ్ఎమ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అన్ని వెర్షన్లు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ని కలిగి ఉంటాయి.
ఇతర ఫీచర్ల వివరాలివే :
రేడియన్ బైక్ బేస్ వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, కలర్ ఎల్‌సీడీ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. 10 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో టీవీఎస్ రేడియన్ డ్రమ్ వేరియంట్ 113 కిలోలు, డిస్క్ వేరియంట్ 115 కిలోల బరువు ఉంటుంది. 180మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఈ బైకు వివిధ రకాల రోడ్లపై కూడా వేగంగా దూసుకెళ్లగలదు.