Samyuktha : కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌తో సంయుక్త
వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది నటి సంయుక్త.

Samyuktha starring female centric action thriller movie launched
వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది నటి సంయుక్త. తాజాగా ఆమె ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. కాగా.. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
Samantha : సమంత ప్రశంసలు అందుకున్న ’35 చిన్న కథ కాదు’
నిర్మాతలు దిల్ రాజు, కోనా వెంకట్, వెంకీ కుడుములతో పాటు రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానా క్లాప్‌కొట్టగా.. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇదంతా ఓ కలలా ఉందని చెప్పింది. ఈ స్టోరీ వినగానే వెంటనే ఓకే చేశాను. కథ చాలా బాగుందన్నారు. దర్శకుడు కథ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ఈ కథ వింటున్నసేపు నా జర్నీనే గుర్తుకు వచ్చింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. సినిమాకు స్ర్కిప్ట్ మాత్రమే ప్రధానం అని, స్ర్కిప్ట్ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు.