Censor Board : ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఓ మై గాడ్ 2 సినిమాని రివ్యూ కమిటీకి పంపిన సెన్సార్ బోర్డ్..
ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ సెన్సార్ బోర్డ్ పై గట్టిగానే పడింది. దీంతో ఇప్పుడు ఓ మై గాడ్ 2 సినిమాకు జాగ్రత్త వహిస్తుంది.

Censor Board sending Oh My God 2 Movie for Review Committee effected by Adipurush movie
Oh My God 2 : ఇటీవల ఆదిపురుష్(Adipurush) సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం అయిన సంగతి తెలిసిందే. సినిమాలోని డైలాగ్స్, పాత్రల స్వరూపాలు, కథనం.. ఇలా అన్ని విషయాల్లోనూ రామాయణంలా లేదని విమర్శలు వచ్చాయి. అయితే ఏ సినిమా అయినా బయటకి రావాలంటే సెన్సార్ బోర్డ్ చూసి క్లియర్ చేసి పంపాలి. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతదేశంలో మతం లాంటి సినిమాలను సున్నితంగా డీల్ చేయకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా సెన్సార్ బోర్డ్ ఆదిపురుష్ కి క్లియరెన్స్ ఇచ్చిందని అంతా తప్పు పట్టారు.
ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ సెన్సార్ బోర్డ్ పై గట్టిగానే పడింది. దీంతో ఇప్పుడు ఓ మై గాడ్ 2 సినిమాకు జాగ్రత్త వహిస్తుంది. 2012లో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఓ మై గాడ్ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో గోపాల గోపాల అని రీమేక్ కూడా చేసారు. ఇప్పుడు ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సారి అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవలే ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. గత సినిమాలో కృష్ణుడితో తీస్తే, ఇప్పుడు శివుడి పాత్రతో తీస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కి వెళ్లడంతో ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూడా ఈ సినిమాని చూపించబోతున్నారట. ఆదిపురుష్ సినిమా విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని, సెన్సార్ బోర్డ్ కి విమర్శలు రాకూడదని జాగ్రత్త వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఓ మై గాడ్ 2 సినిమాలో కూడా వివాదాస్పద అంశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎన్ని కట్స్ ఇస్తుందో చూడాలి.