Ram Mohan Naidu : పుష్ప 2 ఇంకా చూడలేదు.. ఇప్పటి సినిమాల్లో తెలుగు మిస్ అవుతుంది.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు..
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని ఫేవరేట్ హీరో, సినిమాల గురించి, పుష్ప 2 గురించి అడగ్గా..

Central Minister Ram Mohan Naidu Comments on Pushpa 2 and Present Telugu Movies
Ram Mohan Naidu : తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లెవ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ యాంకర్ ఈ ఇద్దరినీ పర్సనల్ గా సరదా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఫుడ్, ఏపీ ప్లేసెస్, సినిమాల గురించి అడిగింది. లోకేష్, రామ్మోహన్ నాయుడు కూడా సరదాగా సమాధానాలు ఇచ్చారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని ఫేవరేట్ హీరో, సినిమాల గురించి, పుష్ప 2 గురించి అడగ్గా.. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య గారి ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు మంచి యాక్టర్. ఆయన ఫేవరేట్ హీరో కూడా బాలయ్య గారే. తెలుగు సినిమాలు అంటే దాన వీర శూర కర్ణ, గుండమ్మ కథ.. లాంటి సినిమాలే. 1950, 60ల్లో వచ్చిన సినిమాలు చాలా బాగుంటాయి. మళ్ళీ అలాంటి సినిమాలు రావు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో తెలుగు మిస్ అవుతుంది. తెలుగుతనం ఉండట్లేదు. ఎన్టీఆర్ గారి సినిమాలు మీరు చూడాలి. లేటెస్ట్ గా డాకు మహారాజ్ చూసాను. నేను ఇంకా పుష్ప 2 సినిమా చూడలేదు అని అన్నారు.
ఇక ఏపీలోని ప్లేసెస్ గురించి మాట్లాడుతూ.. గండికోట రిజర్వాయర్ అందరూ చూడాలి. టెంపుల్స్ లో తిరుపతికి అందరూ వెళ్తారు. శ్రీశైలం కూడా చూడాలి. మా శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్య దేవాలయం చాలా బాగుంటుంది. అందరూ వచ్చి చూడాలి. ఫుడ్ గురించి అడగ్గా.. నాకు చికెన్ 65 ఇష్టం. దాంతో చిల్లి కూడా కలిపి తింటాను అని తెలిపారు.