Chalaki Chanti : ఆరేళ్ళ వయసులో కళ్ళ ముందే తల్లి మరణం.. చలాకి చంటి నవ్వుల వెనుక ఇంత బాధ ఉందా?
తాజాగా చలాకి చంటి సుమ అడ్డా టీవీ షోకి వచ్చారు. (Chalaki Chanti)
Chalaki Chanti
Chalaki Chanti : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించిన చంటి ఆ తర్వాత జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. మధ్యలో ఆరోగ్య సమస్యలతో కొంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలతో మెప్పిస్తున్నాడు.
తాజాగా చలాకి చంటి సుమ అడ్డా టీవీ షోకి వచ్చారు. ఈ షోలో చంటి తన లైఫ్ లో జరిగిన ఓ బాధాకర సంఘటనను పంచుకున్నాడు.
Also Read : Nirupam Paritala : బిగ్ బాస్ లోకి నిరుపమ్ పరిటాల ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు..
చంటి మాట్లాడుతూ.. నాకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు మా అమ్మకు ఫైర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయింది. కళ్ళ ముందు మనిషి కాలిపోతుంటే కష్టంగా ఉంటుంది. పట్టుకొని లాగాలి, ఆమెని కాపాడాలి అనే ఐడియా ఆ ఏజ్ లో ఉండదు. నాకు ముందే తెలిస్తే అది జరగకుండా కాపాడుకునేవాడినేమో అంటూ ఎమోషనల్ అయ్యారు.
దీంతో తన కామెడీతో మనల్ని నవ్వించే చలాకి చంటిలో ఇంత బాధ ఉందా అని షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
