Ravikula Raghurama : ‘రవికుల రఘురామ’ నుంచి చందమామే.. అంటూ మెలోడీ సాంగ్ విన్నారా? ఎంత బాగుందో..

తాజాగా రవికుల రఘురామ సినిమా నుంచి 'చందమామే రమ్మంటే..' అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Chandamame Song from Ravikula Raghurama Movie Released by Director Parasuram

Ravikula Raghurama : పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘రవికుల రఘురామ’. యువ హీరో గౌతమ్ సాగి, దీప్శిఖా జంటగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also Read : Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?

తాజాగా ఈ సినిమా నుంచి ‘చందమామే రమ్మంటే..’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ని గీతగోవిందం, సర్కారువారి పాట లాంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురామ్ చేతులమీదుగా నేడు రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చాలా మెలోడియస్ గా వినడానికి ఎంతో బాగుంది. సుకుమార్ పమ్మి సంగీత దర్శకత్వంలో సమీరా భరద్వాజ్, యాజిన్ నిజార్ పాడగా ఈ పాటని శ్రీమణి రాశారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి.