Unstoppable with NBK S4 : నా సిబ్బంది చెప్పినా వినకుండా వెళ్ళాను.. ఆ తండ్రి బాధ చూసి కన్నీళ్లు వచ్చాయి.. సీఎం ఎమోషనల్..

వ‌ర‌ద‌లు వ‌స్తే హెలికాప్ట‌ర్‌లో తిరిగే నాయ‌కులు ఉన్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ చంద్ర‌బాబును బాల‌య్య ప్ర‌శంసించారు.

Chandrababu Naidu Emotional on Unstoppable show

Unstoppable with NBK S4 : ఆహా వేదిక‌గా బాల‌య్య వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మొద‌టి ఎపిసోడ్‌కు అతిథిగా వ‌చ్చారు. ఈ షోలో బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు సమాధానం ఇచ్చారు. త‌న వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయాలు వంటి విష‌యాల‌ను సైతం చంద్ర‌బాబు పంచుకున్నారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల గురించి సైతం మాట్లాడారు.

వ‌ర‌ద‌లు వ‌స్తే హెలికాప్ట‌ర్‌లో తిరిగే నాయ‌కులు ఉన్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ చంద్ర‌బాబును బాల‌య్య ప్ర‌శంసించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. అందుకే బోటు ఎక్కి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లిన‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు.

Unstoppable with NBK S4 : కుదిరితే కప్పు కాఫీ.. భువనేశ్వరితో.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని, బోటులో వెళ్లొద్దని భద్రతా సిబ్బంది చెప్పినా తాను వినిపించుకోలేద‌న్నారు. వెళ్లి చూస్తేనే ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుస్తాయ‌ని, అందుకే ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా స‌రే ముందుకు వెళ్లాన‌ని అన్నారు. అక్కడి తీవ్రత అర్థమయ్యాక కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడే బస్సులో పదిరోజులు బసచేసి, వరద సహాయ చర్యల్ని పర్యవేక్షించాను అని తెలిపారు.

‘ఓ తండ్రి నా దగ్గరకు వచ్చి మూడు రోజుల నుంచి పిల్లాడు నీళ్లు అడుగుతున్నాడని, రెండు బాటిళ్ల నీళ్లు ఇప్పించాలని అడిగితే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎన్ని మార్గాలుంటే అన్నీ ఉపయోగించి ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు అందజేశాం. బిస్కట్లు, పాలు, పళ్లు, భోజన పదార్థాలు.. ఏది దొరికితే అది పంపించాం. జీవితంలో ఎప్పుడూ చేయనంత శ్రమ చేశాం. పది రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చాం.’ అని చంద్ర‌బాబు అని చెప్పారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి.

Unstoppable with NBK S4 : సీఎం చంద్రబాబుకు వచ్చిన వంటలు ఏంటో తెలుసా..?