Unstoppable with NBK S4 : కుదిరితే కప్పు కాఫీ.. భువనేశ్వరితో.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

టీ, కాఫీల్లో ఏది ఇష్టం అని బాబును బాల‌య్య‌ ప్ర‌శ్నించారు.

Unstoppable with NBK S4 : కుదిరితే కప్పు కాఫీ.. భువనేశ్వరితో.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

CM Chandrababu naidu Intresting comments on Bhuvaneswari in Unstoppable show

Updated On : October 26, 2024 / 11:23 AM IST

Unstoppable with NBK S4 : బాల‌కృష్ణ‌ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొద‌టి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అతిథిగా వ‌చ్చారు. వ్య‌క్తిగ‌త జీవితం, రాజ‌కీయాలు, ప‌వ‌న్‌తో పొత్తు వంటి ఎన్నో విష‌యాల‌ను చంద్ర‌బాబు పంచుకున్నారు. ఈ క్ర‌మంలో బాల‌య్య ఓ ఫ‌న్నీ టాస్క్‌ను ఆడించారు.

రూ.500 నోటు ఇచ్చి చంద్ర‌బాబును షాపింగ్ చేశాల‌ని కోరారు. నిత్యావ‌స‌రాలు అన్ని క‌లిపి దాదాపు ఆ అమౌంట్‌కు ద‌గ్గ‌ర‌గా చంద్ర‌బాబు షాపింగ్ చేశారు. ఇక ఆ త‌రువాత టీ, కాఫీల్లో ఏది ఇష్టం అని బాబును బాల‌య్య‌ ప్ర‌శ్నించారు.

Unstoppable with NBK S4 : సీఎం చంద్రబాబుకు వచ్చిన వంటలు ఏంటో తెలుసా..?

ప్ర‌తి రోజు ఉద‌యం 8.30 నుంచి 9.30 గంట‌ల మ‌ధ్య ఓ కాఫీ తాగుతాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. హైద‌రాబాద్‌లో ఉన్న‌ప్పుడు భువ‌నేశ్వ‌రితో క‌లిసి తాగుతాను. అదే అమ‌రావ‌తిలో ఉంటే డైనింగ్ టేబులే నాకు తోడు. భువ‌నేశ్వ‌రి హైద‌రాబాద్‌లో ఉండ‌డం వ‌ల్ల ఎప్పుడో గానీ క‌ల‌సి కూర్చోనే అవ‌కాశం రాదు. అలాంటి సంద‌ర్భం వ‌స్తే అదే మాకు పెద్ద పండుగ అని చంద్ర‌బాబు చెప్పారు.

విశాఖ‌, విజ‌య‌వాడ న‌గ‌రాల‌ను ఫోటోల‌ను చూపించి ఏ న‌గ‌రం ఇష్టం అనే ప్ర‌శ్న‌ను బాల‌య్య అడిగారు. త‌న ఛాయిస్ అమ‌రావ‌తి అని చంద్ర‌బాబు స‌మాధానం చెప్పారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌ల‌ను రెండింటిని అభివృద్ధి చేస్తామ‌న్నారు.

Unstoppable : మనవడు దేవాంశ్‌ ప్రశ్నలు.. ఫ‌న్నీగా స‌మాధానాలు ఇచ్చిన చంద్ర‌బాబు.