Unstoppable with NBK S4 : సీఎం చంద్రబాబుకు వచ్చిన వంటలు ఏంటో తెలుసా..?

మీకు వంట వ‌చ్చా అని బాబును బాల‌య్య ప్ర‌శ్నించారు.

Unstoppable with NBK S4 : సీఎం చంద్రబాబుకు వచ్చిన వంటలు ఏంటో తెలుసా..?

Do you know what kind of dishes came to CM Chandrababu

Updated On : October 26, 2024 / 10:54 AM IST

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు అతిథిగా వ‌చ్చారు. ఈ షోలో చంద్ర‌బాబు ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. ఇక మీకు వంట వ‌చ్చా అని బాబును బాల‌య్య ప్ర‌శ్నించారు. వెంట‌నే చంద్ర‌బాబు.. మీకు వ‌చ్చా అని బాల‌య్య‌ను ప్ర‌శ్నించారు.

త‌న‌కు వంట రాద‌ని బాల‌య్య స‌మాధానం ఇచ్చారు. అయితే స‌ల‌హాలు మాత్రం బాగా ఇస్తాన‌ని అన్నారు. వంట వ‌చ్చా ప్ర‌శ్న‌కు బాబు ఇలా స‌మ‌ధానం ఇచ్చారు. తాను ప‌ప్పు బ్ర‌హ్మాండంగా చేస్తాన‌ని అన్నారు. అంతేనా.. ఈజీగా ఆమ్లెట్ వేస్తాన‌ని చెప్పారు. ఈ రెండు త‌ప్ప ఇంకేమీ రావ‌ని బాబు తెలిపారు.

Unstoppable : మనవడు దేవాంశ్‌ ప్రశ్నలు.. ఫ‌న్నీగా స‌మాధానాలు ఇచ్చిన చంద్ర‌బాబు.

లోకేశ్ జీవితంలో ట‌ర్నింగ్ పాయింట్ అదే..

యువగళం పాదయాత్ర లోకేశ్‌ రాజకీయ జీవితంలో టర్నింగ్‌ పాయింట్ అని చంద్ర‌బాబు చెప్పారు. పాద‌యాత్ర‌కు ముందు, తర్వాత లోకేశ్‌ వేరు. పాదయాత్ర చేయాలన్నది లోకేశ్‌ నిర్ణయమే. అయితే విద్వేషాలతో నిండిపోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు పాదయాత్ర అంత సజావుగా జరగదేమోనని, పాలకులు దేనికైనా తెగబడతారేమోనని అనుమానించాను. లోకేశ్‌ మాత్రం పాదయాత్ర చేసి తీరాలని పట్టుబట్టాడు అని చంద్ర‌బాబు చెప్పారు.

ఎన్టీఆర్‌కి మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా, బాలయ్య అల్లుడిగా కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకత కావాలని, తనను తాను నిరూపించుకుంటానని వెళ్లాడు. ప్రజల కోసం పోరాడతానని చెప్పి వెళ్లి, తానేంటో నిరూపించుకున్నాడు. అని చంద్ర‌బాబు అన్నారు.

CM Chandrababu : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన మీటింగ్ గురించి.. ఆ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చంద్ర‌బాబు ఏం మాట్లాడరంటే?