Chandrababu – YSR : వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు క్షమాపణాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు.. అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు వ్యాఖ్యలు..

అన్‌స్టాపబుల్ షోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది.

Chandrababu Naidu Interesting Comments on YS Rajasekhar Reddy in Aha Unstoppable Show

Chandrababu – YSR : నేడు ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు రాగా రాజకీయాలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ గురించి.. ఇలా చాలా అంశాలు మాట్లాడారు. అయితే ఈ షోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది.

Also Read : Chandrababu Naidu : ఆ అరెస్టు రోజుని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాను.. అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు ఎమోషనల్..

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏమైనా గొడవలు చేస్తే సంయమనం పాటించాను. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను కూడా నిలదొక్కుకున్నాను. ఆయన దూకుడుగా వ్యవహరిస్తే నేను వార్నింగ్ ఇచ్చాను. ఆయన నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన వాటిని బయటకు తీసుకురాలేదు, వ్యక్తిగతంగా తీసుకోలేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తిగత కక్ష రాజకీయాలు చేసారు. నేను తప్పు చేయలేదు, చేసిన వాళ్ళని వదలను అని అన్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.