‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ చూశారా!
అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ విడుదల చేసిన మూవీ టీమ్..

అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ విడుదల చేసిన మూవీ టీమ్..
అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్’.. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా ఈ చ్రితం రూపొందుతుంది. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేస్తూ, విజన్ వరల్డ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేసింది టీమ్..
సంజయ్ దత్ ‘అహ్మద్ షా అబ్దాలీ’ పాత్రలోనటిస్తున్నారు.. సంజూ భాయ్ లుక్ ఆకట్టుకుంటుంది. కృతి సనన్ తన లుక్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.. ఆమె ‘పార్వతీ బాయి’ క్యారెక్టర్ చేస్తుంది. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు’ పాత్రలో నటిస్తున్నాడు.. అతని లుక్ కూడా రివీల్ చేశారు.
Read Also : ‘తిప్పరామీసం’ – సెన్సార్ పూర్తి
నవంబర్ 5న ‘పానిపట్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. సంగీతం : అజయ్-అతుల్, కెమెరా : సి.కె.మురళీధరన్, నిర్మాణం : అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, విజన్ వరల్డ్ ఫిల్మ్స్.