డ్యాన్స్‌తో ఛార్మిని ఫిదా చేసిన కుర్రాడు

ప్రస్తుతం ఛార్మి ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్ర్కీన్ లో సందడి చేస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ మూవీ నిర్మించగా… ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇందులోని డైలాగ్స్, సాంగ్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక రామ్ వేసిన స్టెప్పుల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం సినిమాకే రామ్ స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. అసలు పెళ్లి వేడుకల్లో ఇస్మార్ట్ శంకర్ పాట లేకుండా వేడుకు పూర్తి కావాట్లేదు. ఈ సాంగ్ యూత్ మాములుగా డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ పెళ్లి వేడుకల్లో ఇస్మార్ట్ శంకర్ లోని చిలకా.. చిలకా పాటకు యూత్ బాయ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవ్వడమే కాకుండా.. దీనిపై ఛార్మి స్పందించింది. నీలో ఎంతో ఎనర్జీ ఉంది. అద్భుతంగా డ్యాన్స్ చేశావు. ఒకవేళ నేను అక్కడి ఉండి ఉంటే.. కచ్చితంగా నీతో కలిసి డ్యాన్స్ చేసేదాన్ని అని తన ట్వీట్ లో పేర్కొంది.
Amaaaaaaazing man … soooo charmingly energetic.. wish I was there to dance with u ??? https://t.co/ZYBusz5oeF
— Charmme Kaur (@Charmmeofficial) November 28, 2019