Shalu Chaurasia : నటి చౌరాసియా కేసులో నిందితుడు పట్టివేత

పోలీసులు నిందితుడు వదిలి వెళ్లిన పౌచ్ తో వేలి ముద్రలు కనిపెట్టి, నిందితుడి డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆదారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.

Chaurasiya

Shalu Chaurasia :  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా దుండగులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చౌరాసియా 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఈ కేసుని వేగంగా పరిశోధించారు. ఆ తర్వాత చౌరాసియా కూడా మీడియాతో మాట్లాడి నిందితుడు తన ఫోన్ తో పాటు రింగ్ ని కూడా ఎత్తుకెళ్లాడని, లైంగిక దాడికి యత్నించాడని తెలియచేసింది.

Bigg Boss 5 : కొత్త కెప్టెన్‌గా మానస్.. కాజల్‌తో గొడవలకు ఫుల్‌స్టాప్..

పోలీసులు నిందితుడు వదిలి వెళ్లిన పౌచ్ తో వేలి ముద్రలు కనిపెట్టి, నిందితుడి డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆదారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల సుదీర్ఘ అన్వేషణ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

నటి ఛౌరాసియాపై దాడి చేసిన వ్యక్తి పేరు బాబుగా గుర్తించారు. హైదరాబాద్ కృష్ణానగర్లో బాబు నివాసం ఉంటున్నాడు. సినిమాల్లో లైట్ మేన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఘటన అనంతరం బాబు కృష్ణానగర్ లోని తన ఇంటికి వెళ్ళాడు. కొన్ని చోట్ల సిసి కెమెరాలు పని చేయకపోవడంతో నిందితుడిని గుర్తించడం ఆలస్యమైందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి బాబుని విచారిస్తూ అతని గత నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు.