‘చెక్’ పెట్టనున్న యూత్ స్టార్..

Nithin’s Check – Title & Pre-Look: యూత్ స్టార్ నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్న నితిన్, మరో వైపు ‘అంధాధూన్’ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా మరో మూవీ అనౌన్స్ చేశారు. భవ్య క్రియేషన్స్, వి. ఆనందప్రసాద్ నిర్మాతగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. రకుల్ ప్రీత్, ప్రియ ప్రకాష్ వారియర్ కథానాయికలు..
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ప్రీ లుక్‌ని గురువారం సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేశారు. ముందునుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రీ లుక్‌లో నితిన్ చేతులకు బేడీలు వేసి ఉండగా.. ఎదురుగా చెస్ బోర్డ్, కంచె చూపించారు.
ఈ ప్రీ లుక్ విడుదల చేసిన కొరటాల శివ.. ‘‘నా అభిమాన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి, నితిన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా టైటిల్, ప్రీ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు భవ్య క్రియేషన్స్..’’ అని తెలిపారు.