Assam Film Award Winners : రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి..

అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో గందరగోళం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో విజేతలకు ప్రభుత్వం చెక్కులు బహుమతిగా ఇచ్చింది. ఈ చెక్కులను డిపాజిట్ చేయడానికి వెళ్లిన విజేతలకు చేదు అనుభవం ఎదురైంది.

Assam Film Award Winners : అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో గందరగోళం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో విజేతలకు ప్రభుత్వం చెక్కులు బహుమతిగా ఇచ్చింది. ఈ చెక్కులను డిపాజిట్ చేయడానికి వెళ్లిన విజేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఒకరు, ఇద్దరికి కాదు ఏకంగా ఎనిమిది మంది చెక్కు బౌన్స్ అయ్యింది అంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిలో పడింది. మార్చి 17న ఎనిమిది మంది విజేతలకు ఇచ్చిన తొమ్మిది చెక్కులను క్లియరెన్స్ కోసం బ్యాంకుకి పంపించారు.

Allu Arjun : అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడు.. వరుడు హీరోయిన్ భానుశ్రీ!

ఉత్తమ రచయితగా అవార్డును గెలుచుకున్న అపరాజిత పూజారి PTI కి బ్యాంకు నుంచి కాల్ చేసి.. మీ చెక్కు బౌన్స్ అయ్యింది అంటూ తెలియజేశారు. దీంతో అపరాజిత పూజారి అవార్డుల వేడుకను నిర్వహిస్తున్న అస్సాం స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ASFFDC) సంప్రదించారు. అయితే బౌన్స్ అయ్యింది కేవలం అపరాజిత పూజారిది మాత్రమే కాదు ఆయనతో పాటు ప్రాంజల్ దేకా (దర్శకత్వం), అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చంగ్‌మై (సౌండ్ మిక్సింగ్), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్) మరియు బెంజమిన్ డైమరీ (నటన) చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి అని బ్యాంకు నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది.

Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

ఈ ఘటనతో అస్సాంలో తీవ్ర దుమారం రేగింది. దీంతో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా తన అధికారులను వెంటనే విచారణ జరిపించాలని కోరారు. విచారణలో తెలిసింది ఏంటంటే.. సాంకేతిక కారణాలు వల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయి అని తెలిసింది. మొదటి రోజు 18 లక్షల విలువైన చెక్కులు క్లియర్ చేయడం జరిగింది. రెండో రోజు సాంకేతిక సమస్యల వాళ్ళ ఎనిమిది మంది వ్యక్తుల తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయి. సమస్యని గుర్తించి పరిక్షరించినట్లు వెల్లడించారు. మళ్ళీ విజేతలకు ఫోన్ చేసి చెక్కు డిపాజిట్ చేయమని కోరినట్లు కూడా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు