Chikiri Song: పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది.. రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "పెద్ది". ఉప్పెన ఫేమ్ దర్శకుడు (Chikiri Song)బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Chikiri Song: పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది.. రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్..

Chiki song from Ram Charan's Peddi movie is out

Updated On : November 7, 2025 / 11:13 AM IST

Chikiri Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “పెద్ది”. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ (Chikiri Song)కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. తాజాగా చికిరి.. చికిరి అనే సాంగ్ ను విడుదల చేశారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్స్, జాన్వీ లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా వినేయండి.

Vijay-Rashmika: నువ్వు గర్వపడతావ్.. విజయ్ పై ప్రేమ వర్షం కురిపించిన రష్మిక..