Nakshathra : ‘ఇరుముడి’ చైల్డ్ ఆర్టిస్ట్‌కి.. ముందే హీరోయిన్ ఆఫర్ ఇచ్చిన నిర్మాత..
ఇరుముడి సినిమాలో నక్షత్ర అనే చైల్డ్ ఆర్టిస్ట్ రవితేజకు కూతురుగా నటించింది.(Nakshathra)
Nakshathra
Nakshathra : ఇరుముడి సినిమాలో నక్షత్ర అనే చైల్డ్ ఆర్టిస్ట్ రవితేజకు కూతురుగా నటించింది. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఏడిపించేసింది నక్షత్ర. కూతురు పాత్రలో తండ్రితో అనుబంధం ఉంటూ, తండ్రికి సపోర్ట్ చేసే మంచి ఎమోషనల్ పాత్రలో నటించింది. అసలు ఇంత చిన్న వయసులో అన్ని ఎమోషన్స్ పండించడం నిజంగా అభినందించాల్సిన విషయం.
నక్షత్ర కేరళలోని కన్నూర్ కి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇప్పటికే నక్షత్ర చిన్నప్పట్నుంచీ పలు యాడ్స్ లో నటించింది. మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నో బడీ సినిమాలో పృథ్వీరాజ్ కూతురిగా నటించింది. అది కాకుండా మరో మలయాళం సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు ఇరుముడి సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడలో శివ రాజ్ కుమార్ డాడ్ సినిమాలో నటిస్తుంది. ఇరుముడి తర్వాత నక్షత్రకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని సమాచారం.
Also See : Nanju Warrier : మలయాళం స్టార్ హీరోయిన్.. మంజు వారియర్ ఓనం సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో..
నక్షత్ర ప్రస్తుతం ఏడవ తరగతి చదువుకుంటుంది. అయితే నక్షత్ర చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండగానే భవిష్యత్తులో హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు నిర్మాత. ఇరుముడి సినిమా నిర్మాత మైత్రి రవి శంకర్ ఇటీవల ఇరుముడి సక్సెస్ అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. కొంతమంది పేర్లు దేవుడు డిసైడ్ చేస్తాడేమో. నక్షత్ర అంటే స్టార్. చెన్నై సినిమా ప్రమోషన్స్ లో కూడా మాకు ఒకరు చెప్పారు తను పుట్టుకతోనే స్టార్ అని. కొంతమంది పేర్లు తెలియకుండానే రియల్ గా పెట్టేస్తారేమో. నక్షత్ర బ్రిలియంట్ యాక్టర్. బాగా చదువుకోమ్మా. భవిష్యత్తులో నీకు ఎప్పుడు ఇండస్ట్రీ మీద ప్రేమ పెరిగి హీరోయిన్ గా చేస్తాను అంటే చెప్పు. మా అమ్మాయిని హీరోయిన్ గా చేసినట్టు ఫీల్ అయి మేమే లాంచ్ చేస్తాము హీరోయిన్ గా అని తెలిపారు.
Also Read : Payal Radhakrishna : మా నాన్నతో కలిసి తాగుతాను.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..
చైల్డ్ ఆర్టిస్ట్ తో అందర్నీ మెపించిన నక్షత్ర చైల్డ్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు కాదు భవిష్యత్తులో హీరోయిన్ గా కూడా ఇప్పట్నుంచే ఛాన్సులు కొట్టేస్తుంది. మరి ఫ్యూచర్ లో ఈ కేరళ పాప హీరోయిన్ అవుతుందా లేదా చూడాలి.
