Nenu Keerthana : ‘నేను కీర్తన’ మూవీ రివ్యూ..

నేను కీర్తన సినిమా ఆగస్టు 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Chimata Ramesh Babu Nenu Keerthana Movie Review and Rating

Nenu Keerthana Movie Review : చిమటా రమేష్ బాబు హీరోగా, రిషిత, మేఘన హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘నేను కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లక్ష్మి కుమారి నిర్మాణంలో రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ నేను కీర్తన సినిమా ఆగస్టు 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది. సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ .. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. తన కళ్ళ ముందు జరిగే అన్యాయాలను ఎదురిస్తూ , ఆపదలో ఉండేవారికి సహాయం చేస్తూ ఉంటాడు జానీ(రమేష్ బాబు). అతని జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి వచ్చాక అతని జీవితం ఎలా మారింది? జానీ సమాజం కోసం ఏం చేసాడు అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఈ సినిమా ఒక్క జోనర్ అని కాకుండా మల్టీ జోనర్ ఫిల్మ్ అని ముందు నుంచి ప్రచారం చేసారు. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్.. ఇలా అని రకాల జోనర్లు కలిపి చూపించారు. కథలో ట్విస్టులు మెప్పిస్తాయి. సినిమా పలుచోట్ల సాగదీసినట్టు ఉంటుంది. కామెడీ పర్వాలేదనిపించినా బిసి సెంటర్స్ కి నచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేసుకున్నారు.

Also Read : Nani US Record : అమెరికాలో నాని రికార్డ్.. ఏకంగా 10 సినిమాలతో.. మహేష్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయం..

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క రచయిత, దర్శకుడు, నిర్మాతగా కూడా తన ట్యాలెంట్ చూపించాడు రమేష్ బాబు. విజయ్ రంగరాజు, జీవాలు విలనిజం బాగానే పండించారు. కొత్త హీరోయిన్స్ రిషిత, మేఘనలు అందంతో మెప్పించారు. జబర్దస్త్ అప్పారావు బాగానే కామెడీ పండించారు. ఐటెం సాంగ్ లో రేణు ప్రియా ఆకట్టుకుంది.

సాంకేతిక అంశాలు.. మొదటి సినిమా అయినా ఓ పక్కన హీరోగా నటిస్తూనే మరో పక్కన డైరెక్టర్ గా బాగానే తెరకెక్కించాడు రమేష్ బాబు. కథ, కథనం ఇంకా బాగా రాసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. కానీ కొన్ని పాటలోని లొకేషన్స్, విజువల్స్ బాగుంటాయి.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు