Nani US Record : అమెరికాలో నాని రికార్డ్.. ఏకంగా 10 సినిమాలతో.. మహేష్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయం..
నాని మహేష్ బాబు రికార్డుని ఈజీగానే బ్రేక్ చేస్తాడనిపిస్తుంది.

Natural Star Nani Creates Record in America with Saripodhaa Sanivaaram Collections
Nani US Record : మన తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మన సినిమాలన్నీ అక్కడ కూడా రిలీజ్ అవుతాయి. అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్ సాధిస్తాయి. అమెరికా మార్కెట్ ని కూడా టార్గెట్ చేసుకొని మన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా కలెక్షన్స్ కూడా రికార్డుల్లో జత చేరుస్తున్నారు.
అమెరికాలో మన తెలుగు సినిమా 1 మిలియన్ డాలర్స్ సాధించింది అంటే అక్కడ హిట్ అయినట్టే. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేసినట్టే. ఇటీవల 1 మిలియన్ డాలర్స్ మించి మరీ కొన్ని సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అమెరికాలో ఎక్కువ 1 మిలియన్ డాలర్ సినిమాలు సాధించిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ఏకంగా 12 సినిమాలకు 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించారు. దూకుడు నుంచి గుంటూరు కారం వరకు అలా దూసుకెళ్తూనే ఉన్నారు.
Also Read : Ustaad Bhagat Singh : పవన్‌ని కలిసాము.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ అప్పటికల్లా పూర్తిచేసేస్తాం..
మహేష్ బాబు తర్వాత నానినే ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ సాధించిన లిస్ట్ లో ఉన్నారు. తాజాగా రిలీజయిన సరిపోదా శనివారం సినిమా నిన్నటితో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేసింది. దీంతో నాని అమెరికాలో ఇప్పటివరకు మొత్తం ఏకంగా 10 సినిమాలతో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసాడు. నాని తర్వాతే మన స్టార్ హీరోలంతా ఉన్నారు.
అయితే నాని మహేష్ బాబు రికార్డుని ఈజీగానే బ్రేక్ చేస్తాడనిపిస్తుంది. మహేష్ – రాజమౌళి సినిమా రావడానికి కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఈ గ్యాప్ లో నాని ఇంకో నాలుగు సినిమాలు తీసి ఈ నాలుగు కూడా 1 మిలియన్ డాలర్స్ సాధించి మహేష్ రికార్డుని బద్దలు కొట్టేస్తాడు. మొత్తానికి అమెరికాలో 1 మిలియన్ రికార్డ్స్ లో నాని ప్రతి సినిమాతో దూసుకెళ్తున్నారు.
He came. He saw. He conquered.
That’s @NameisNani for you! 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/VSOurIiq0Y
— DVV Entertainment (@DVVMovies) August 30, 2024