Ustaad Bhagat Singh : పవన్‌ని కలిసాము.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ అప్పటికల్లా పూర్తిచేసేస్తాం..
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు నిర్మాత.

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Shooting Update
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ చేతిలో మిగిలిపోయిన మూడు సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న పొలిటికల్ బిజీలో వాటికి ఎలాగైనా డేట్స్ ఇచ్చి పూర్తి చేసేయాలని చూస్తున్నారు పవన్. మొదట OG కి డేట్స్ ఇవ్వబోతున్నారని, సెప్టెంబర్ లో OG షూట్ జరగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు నిర్మాత.
Also Read : Pushpa 2 Update : పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. వినాయకచవితికి ఏం లేకపోయినా అప్పుడు మాత్రం..
మైత్రి నిర్మాత రవిశంకర్ తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇటీవలే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఉస్తాద్ భగత్ షూట్ కొన్ని వారాల్లో మొదలుపెడతాము. మొత్తం షూట్ డిసెంబర్ లేదా జనవరి కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నాడు ఆల్రెడీ షూట్ చేసిన దాని నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తాము ఫ్యాన్స్ కి అని తెలిపారు.
Recently we met with #PawanKalyan garu. We will start #UstaadBhagatSingh shoot in few weeks and the entire shoot will be finished by December or January.
A special surprise on September 2nd.
Producer #Ravishankar at #MathuVadalara2 Teaser launch
— Suresh PRO (@SureshPRO_) August 30, 2024
దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు మళ్ళీ పవన్ సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ మొదలు పెట్టాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో వచ్చే సంవత్సరంలో పవన్ సినిమాలు రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు.