Pushpa 2 Update : పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. వినాయకచవితికి ఏం లేకపోయినా అప్పుడు మాత్రం..

తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ పుష్ప 2 అప్డేట్ గురించి మాట్లాడుతూ..

Pushpa 2 Update : పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. వినాయకచవితికి ఏం లేకపోయినా అప్పుడు మాత్రం..

Allu Arjun Sukumar Pushpa 2 Movie Update given by Producer

Updated On : August 30, 2024 / 12:40 PM IST

Pushpa 2 Update : అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ వైరల్ అయి అంచనాలు భారీగా పెంచాయి. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా వాటిని ఇటీవల సుకుమార్, బన్నీ కొట్టిపారేశారు.

Also Read : Faria Abdullah : ఈ మూవీ కోసం నేనే పాట రాసి, పాడి, డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాను..

తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పుష్ప 2 అప్డేట్ అడగడంతో రవి శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వారానికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. నవంబర్ కి పూర్తి సినిమా మా చేతిలో పెడతారు. వినాయకచవితికి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమాలో ఇంకో రెండు పాటలు ఉన్నాయి. సెప్టెంబర్ చివర్లో ఒక సాంగ్, అక్టోబర్ లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తాము. నవంబర్ 20 నుంచి ఫుల్ గా పుష్ప ప్రమోషన్స్ చేస్తాము. పుష్ప 2 ప్రీమియర్స్ కూడా ఉంటాయి అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.