Nenu Keerthana Song : ‘నేను కీర్తన’ నుంచి.. లిరికల్ సాంగ్ విడుదల చేసిన డైరెక్టర్ సాయి రాజేష్..

నేను కీర్తన సినిమా నుంచి పాటను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు.

Nenu Keerthana Song : ‘నేను కీర్తన’ నుంచి.. లిరికల్ సాంగ్ విడుదల చేసిన డైరెక్టర్ సాయి రాజేష్..

Chimata Ramesh Nenu Keerthana Movie Song Released by Director Sai Rajesh

Updated On : June 10, 2024 / 6:38 PM IST

Nenu Keerthana Song : చిమటా రమేష్ బాబు హీరోగా, రిషిత, మేఘన హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘నేను కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిమటా లక్ష్మి కుమారి నిర్మాణంలో చిమటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘నేను కీర్తన’ సినిమా నుంచి తాజాగా ‘సీతాకోకై ఎగిరింది మనసే..’ అంటూ సాగే లిరికల్ వీడియో విడుదల చేసారు. ఈ పాటను బేబీ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేశారు.

Also Read : Thufaanu Hecharika : ‘తుఫాను హెచ్చరిక’ రాబోతుంది.. ఫస్ట్ లుక్ రిలీజ్..

ఈ పాట విడుదల అనంతరం సాయి రాజేష్ మాట్లాడుతూ.. కులుమనాలిలో ఈ పాటను చాలా బాగా చిత్రీకరించారు. పాట బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

Nenu Keerthana Song

అనంతరం దర్శకుడు చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ లో సమయం కేటాయించి మా పాట రిలీజ్ చేసినందుకు సాయి రాజేష్ గారికి కృతజ్ఞతలు. మల్టీ జానర్ ఫిల్మ్ గా తెరకెక్కిన నేను కీర్తన సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.