Thufaanu Hecharika : ‘తుఫాను హెచ్చరిక’ రాబోతుంది.. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజాగా నేడు 'తుఫాను హెచ్చరిక' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Allu Ramakrishna Suhana Mudvari Thufaanu Hecharika Movie First Look Released
Thufaanu Hecharika : అల్లు రామకృష్ణ, సుహానా ముద్వారి జంటగా శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ నిర్మాణంలో జగదీష్ కెకె దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘తుఫాను హెచ్చరిక’.
ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
Also Read : Kalki AD 2898 : ఎన్నికల ఫలితాల తరువాత.. అమరావతిలో జరిగే మొదటి సినిమా ఈవెంట్ ప్రభాస్‌దేనా?
ఈ సందర్భంగా డైరెక్టర్ జగదీష్ కెకె మాట్లాడుతూ.. మా ‘తుఫాను హెచ్చరిక’ ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసాము. ఒక అందమైన హిల్ స్టేషన్ లో హ్యాపీగా ఉండే ఓ అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశంతో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. లంబసింగి, చింతపల్లి లాంటి లొకేషన్స్ లో చలిలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కష్టపడి షూటింగ్ చేసాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము అని తెలిపారు.