Chinmayi Sripada : అతనితో జాగ్రత్తగా ఉండు.. తమిళ నటిని హెచ్చరించిన చిన్మయి..

తాజాగా తమిళ నటి, యాంకర్ వీజే అర్చన ఇటీవల రచయిత వైరముత్తుని ఓ షూటింగ్ సమయంలో కలిసింది. అతనితో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అర్చన. దీంతో ఈ పోస్ట్ కింద కామెంట్స్ లో చిన్మయి..............

Chinmayi Sripada :  సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద అందరికి పరిచయమే. సమంతకి వాయిస్ ఇచ్చి మరింత పాపులర్ అయింది. నటుడు, దర్శకుడు రాహుల్ రామకృష్ణని పెళ్లి చేసుకున్న చిన్మయి ఇటీవలే కవల పిల్లలకి కూడా జన్మనిచ్చింది. అయితే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒకదానిపై సంచలనంగా పోస్టులు చేస్తూ ఉంటుంది.

గతంలో తమిళ సీనియర్ పాటల రచయిత వైరముత్తు తనని లైంగికంగా వేధించాడని, తనని ఇండస్ట్రీలో ఎదగనివ్వను అని బెదిరించాడని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది. తమిళనాట ఇది పెద్ద చర్చగా మారింది. అప్పట్నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా వైరముత్తు గురించి ఏదో ఒక రకంగా కామెంట్స్ చేస్తూనే ఉంది.

H Vinoth : ముందు ‘వరిసు’ సినిమానే చూస్తాను.. ‘తునివు’ డైరెక్టర్ కామెంట్స్..

తాజాగా తమిళ నటి, యాంకర్ వీజే అర్చన ఇటీవల రచయిత వైరముత్తుని ఓ షూటింగ్ సమయంలో కలిసింది. అతనితో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అర్చన. దీంతో ఈ పోస్ట్ కింద కామెంట్స్ లో చిన్మయి.. అతనితో జాగ్రత్తగా ఉండు, అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అతన్ని కలవకపోవడమే బెటర్. అతన్ని కలవడానికి వెళ్తే ఎవర్నో ఒకర్ని తోడు తీసుకెళ్ళు అని కామెంట్ చేసింది. దీంతో చిన్మయి చేసిన కామెంట్ వైరల్ అవ్వగా నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు