H Vinoth : ముందు ‘వరిసు’ సినిమానే చూస్తాను.. ‘తునివు’ డైరెక్టర్ కామెంట్స్..

తమిళనాడులో విజయ్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ వివాదం ఎప్పుడూ ఉండేదే. ఈ సారి అది మరింత ఎక్కువ అయింది. ఈ సారి సంక్రాంతికి విజయ్ నటించిన వరిసు సినిమా, అజిత్ నటించిన తునివు సినిమా రెండూ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్......

H Vinoth : ముందు ‘వరిసు’ సినిమానే చూస్తాను.. ‘తునివు’ డైరెక్టర్ కామెంట్స్..

Thunivu Director H Vinoth comments on Varisu Movie

H Vinoth :  తమిళనాడులో విజయ్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ వివాదం ఎప్పుడూ ఉండేదే. ఈ సారి అది మరింత ఎక్కువ అయింది. ఈ సారి సంక్రాంతికి విజయ్ నటించిన వరిసు సినిమా, అజిత్ నటించిన తునివు సినిమా రెండూ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ మా హీరో అంటే మా హీరో అని కొట్టుకుంటున్నారు.

ఇక మొదటి నుంచి వరిసు సినిమా వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్మాత దిల్ రాజు అజిత్ కంటే విజయ్ పెద్ద యాక్టర్ అనడంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుని దారుణంగా ట్రోల్ చేశారు. ఇలా తమిళనాడులో ప్రస్తుతం వరిసు వర్సెస్ తునివు సినిమాల వివాదం నడుస్తుంది. ఇది సంక్రాంతి అయ్యేదాకా ఆగేలా లేదు. తాజాగా తునివు సినిమా డైరెక్టర్ హెచ్ వినోత్ చేసిన కామెంట్స్ మరోసారి చర్చగా మారాయి.

Neha Chowdary : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వెంటనే ఫైనల్ ఎపిసోడ్ కి..

తునివు సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ వినోత్ ఓ ఇంటర్వ్యూకి హాజరవ్వగా తునివు, వరిసు ఈ రెండు సినిమాల్లో రిలీజయ్యాక ముందు ఏది చూస్తారు అని అడిగారు. దీనికి వినోత్ సమాధానమిస్తూ.. తునివు సినిమా ఇప్పటికే నేను చాలా సార్లు చూసేశాను కాబట్టి వరిసు సినిమానే చూస్తాను అన్నాడు. దీంతో కొంతమంది అజిత్ తో సినిమా తీసి విజయ్ సినిమా చూస్తానంటావా అని ట్రోల్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మన సినిమా వచ్చేసింది, అవతలి వాళ్ళ సినిమా ఎలా ఉందో ముందు చూడాల్సిందే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో ఈ సంక్రాంతి అయ్యేదాకా ఈ రెండు సినిమాలు ఏదో రకంగా ట్రెండ్ లో ఉంటున్నాయి.