Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా..? ఎవరూ ఊహించి ఉండరు..

అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు.

Chinna Jeeyar Swamy to grace as prominent guest for Adipurush Pre Release Event

Adipurush Pre Release event :  ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు.

అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు. ఈ సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేస్తుండటంతో ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద గురువు శ్రీ చినజీయర్ స్వామి విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Sonal Chauhan : బాలీవుడ్‌ని ‘ఆదిపురుష్’కు ముందు ‘ఆదిపురుష్’కు తర్వాతగా చూస్తాం.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

అభిమానులు ఈ సినిమాకి ఇంకెవరైనా సినీ సెలబ్రిటీలు గెస్ట్ గా వస్తారనుకున్నారు. కానీ సినిమాని ఆధ్యాత్మికంగానే ప్రమోషన్స్ చేస్తుండటంతో శ్రీ చినజీయర్ స్వామిని పిలిచినట్లు, ఆయనైతేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు శ్రీ చినజీయర్ స్వామి వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. దాదాపు 150 కోట్ల భారీ ధరకు తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం.