Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..
రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి, నిర్మాత అనిల్ సుంకర మధ్య గొడవ జరిగిందా..? నెట్టింట వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ నిజమేనా..?
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీసెంట్ గా నటించిన చిత్రం భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. రీమేక్ సినిమా కావడంతో మొదటి నుంచి ఈ మూవీ పై ఆడియన్స్ లో పెద్ద ఆసక్తి కనిపించలేదు. ఇక థియేటర్స్ లో మెహర్ రమేష్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోకపోవడంతో మొదటిరోజే ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.
Anasuya : స్వాతంత్ర సమరయోధురాలు ‘బేగం హజ్రత్ మహల్’గా అనసూయ.. సినిమానా..?
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి అండ్ నిర్మాత అనిల్ సుంకర మధ్య గొడవ జరిగిందని ఇటీవల ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. చిరుకి ఇవ్వాల్సిన మొత్తం రెమ్యూనరేషన్ నిర్మాత క్లియర్ చేయలేదట. దీని గురించి చిరంజీవి ఇటీవల అనిల్ సుంకరని గట్టిగా ప్రశ్నించగా.. మిగిలిన బ్యాలన్స్ ని ఇచ్చేందుకు నిర్మాత తన ఆస్తులను అమ్ముకున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీకి చెందిన ఒక మెగా అభిమాని అనిల్ సుంకరకి డైరెక్ట్ చేసి క్లారిటీ కోరాడు.
Karthik Dandu : విరూపాక్ష దర్శకుడు నుంచి మరో థ్రిల్లర్.. ఈసారి పురాణగాథలోని మిస్టరీ..
ఇక ఆ మెసేజ్ కి నిర్మాత బదులిస్తూ.. “అవన్నీ రూమర్స్. మీరేమి పట్టించుకోకండి. చిరంజీవి గారు స్వార్థం లేని మనిషి. నేను చిరంజీవి గారితో మరో సినిమా చేయబోతున్నా. ఆ వార్తలు అన్నిటికి మరో సినిమాతోనే సమాధానం చెబుదాం” అని రిప్లై ఇచ్చాడు. అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే నిజంగా అనిల్ సుంకర, మెగా అభిమాని మధ్య జరిగిన సంభాషణా? లేక ఫేక్? అనేది తెలియదు. కాగా చిరంజీవి కూడా మొదటిలో ఈ రీమేక్ చేయడానికి ఓకే చెప్పలేదు. నిర్మాత ఒప్పించడంతో ఒప్పుకున్నట్లు సినిమా రిలీజ్ కి ముందే చిరంజీవి తెలియజేశాడు.