తమవంతు సాయం ప్రకటించిన మెగాస్టార్, సూపర్ స్టార్..

కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు..

  • Published By: sekhar ,Published On : March 26, 2020 / 10:33 AM IST
తమవంతు సాయం ప్రకటించిన మెగాస్టార్, సూపర్ స్టార్..

Updated On : March 26, 2020 / 10:33 AM IST

కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనాపై పలువురు సినీ ప్రముఖులు ముదుకొస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పేద కళాకారులను ఆదుకోవడాని చిత్ర పరిశ్రమతో పాటు ప్రజలకు తమవంతుగా సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.

ఈ మహమ్మారిపై పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరొక కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులను పేద కళాకారులను ఆదుకోవడానికి చిరు కోటి రూపాయలు అందచేయనున్నట్టు ప్రకటించారు.

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50లక్షలు ఇస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, టెక్నీషియన్స్ విరాళాలు ప్రకటిస్తున్నారు.