మొక్కలు నాటిన మెగా బ్రదర్స్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు మంచి స్పందన వస్తుంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారి స్నేహితులను ఈ ఛాలెంజ్‌లోపాల్గొనాలంటూ నామినేట్ చేస్తున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. అందులో భాగంగా ఈ సొసైటీ ప్రాంగణంలో వీరు మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.