Mega Brothers : మేనల్లుడి కోసం మెగా బ్రదర్స్..

మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు..

Mega Brothers : మేనల్లుడి కోసం మెగా బ్రదర్స్..

Mega Brothers

Updated On : September 22, 2021 / 3:07 PM IST

Mega Brothers: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు. సాయి తేజ్ – దేవ కట్టా కాంబోలో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..

ఇదిలా ఉంటే మేనల్లుడి కోసం మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అండగా నిలబడబోతున్నారు. చిరంజీవి వేసిన బాటలో మెగా – అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా కష్టపడి తమకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వారు నిలదొక్కుకునే వరకు చిరు కూడా సపోర్ట్‌గా నిలిచారు. ఇప్పుడు మేనల్లుడి సినిమా ‘రిపబ్లిక్’ ట్రైలర్ చిరు విడుదల చేశారు.

తర్వాత పవన్ కూడా తనకిష్టమైన మేనల్లుడి కోసం రంగంలోకి దిగబోతున్నారు. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్‌కి కూడా పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చారు. అక్టోబర్ 1న ‘రిపబ్లిక్’ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..