Bholaa Shankar : భోళా శంకర్ తెలుగులో అయిపోయింది.. హిందీలో రిలీజ్‌కి రెడీ.. మెగాస్టార్‌కి డబ్బింగ్ ఎవరో తెలుసా?

తెలుగులో భోళా శంకర్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కనీసం ఎంతోకొంత అమౌంట్ వస్తుంది అని ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Bholaa Shankar : భోళా శంకర్ తెలుగులో అయిపోయింది.. హిందీలో రిలీజ్‌కి రెడీ.. మెగాస్టార్‌కి డబ్బింగ్ ఎవరో తెలుసా?

Chiranjeevi Bholaa Shankar Hindi Version Released in Bollywood on August 25th

Updated On : August 15, 2023 / 8:09 AM IST

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భోళా శంకర్(Bholaa Shankar). తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ సినిమా అభిమానులని, ప్రేక్షకులని బాగా నిరాశపరిచింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కేవలం 50 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని సమాచారం. అంటే 25 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని, అసలు ఎక్కడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని తెలుస్తుంది.

మరోపక్క జైలర్ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ భోళా శంకర్ మీద కూడా పడటంతో థియేటర్స్ నుంచి రిలీజయి వారం కాకముందే తప్పుకుంటుంది. తెలుగులో భోళా శంకర్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కనీసం ఎంతోకొంత అమౌంట్ వస్తుంది అని ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. భోళా శంకర్ సినిమాకి హిందీ డబ్బింగ్ చెప్పించి ఆగస్టు 25న బాలీవుడ్ లో రిలీజ్ చేయబోతున్నారు. RKD స్టూడియోస్ భోళా శంకర్ హిందీ రైట్స్ ని కొనుక్కుంది.

Movies : కరోనా దెబ్బకు పడిపోయిన సినిమాల నిర్మాణం.. సెన్సార్ బోర్డు నివేదిక.. సంవత్సరానికి ఎన్ని సినిమాలు?

తాజాగా భోళా శంకర్ హిందీ వర్షన్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక భోళా శంకర్ హిందీ వర్షన్ లో మెగాస్టార్ కి జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిరాశపరిచిన భోళా శంకర్ సినిమా హిందీలో ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.