Bholaa Shankar : భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. మెగాస్టార్ రేంజ్ కి తక్కువే..

భోళా శంకర్ మూవీ నిన్న ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. భోళా శంకర్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా...

Bholaa Shankar : భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. మెగాస్టార్ రేంజ్ కి తక్కువే..

Chiranjeevi Bholaa Shankar Movie First Day Collections

Updated On : August 12, 2023 / 11:02 AM IST

Bholaa Shankar Collections :  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్(Bholaa Shankar). అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో మెహర్ రమేష్(Meher Ramesh) ఈ సినిమాని తెరకెక్కించాడు. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ నిన్న ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి ముందు నుంచి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక అభిమానులు కూడా నిరాశ చెందారు. మెగాస్టార్ గత సినిమా వాల్తేరు వీరయ్య భారీ హిట్ కొడితే భోళా శంకర్ సినిమా మాత్రం ఎక్కడా వినిపించట్లేదు కూడా. ఇదే సమయానికి రజినీకాంత్ జైలర్ కూడా రిలీజయి భారీ హిట్ అవ్వడంతో భోళా శంకర్ కి ప్రేక్షకులు కూడా తగ్గుతున్నారు.

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగా ఛాన్స్‌ని మిస్ యూజ్ చేసుకున్న మెహర్ రమేష్?

భోళా శంకర్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే కేవలం 15 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లు కలెక్ట్ చేయగా మిగిలిన ప్లేస్ లలో 3 కోట్లు కలెక్ట్ చేసింది. భోళా శంకర్ సినిమాకు దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 82 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే దాదాపు 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. డివైడ్ టాక్ తో మొదలుపెట్టిన భోళా శంకర్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందా లేదా చూడాలి మరి.