Chiranjeevi Birthday Wishes to Pawan Kalyan: బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే, జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే’’.. అంటూ పవన్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. చిరు షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan pic.twitter.com/cOE5G1ljK5— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2020