Sivaji : బిగ్‌బాస్‌లో శివాజీ పర్ఫార్మెన్స్ చూసి మెగాస్టార్ ఏమన్నారంటే..? బయటపెట్టిన శివాజీ..

బిగ్‌బాస్‌లో శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మెగాస్టార్ తనతో మాట్లాడారట. ఇటీవల విక్టరీ వెంకటేష్ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్‌లో..

Chiranjeevi comments about Sivaji performance in telugu biggboss 7

Sivaji : టాలీవుడ్ యాక్టర్ శివాజీ తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇక ఇటీవల బిగ్‌బాస్ షోకి వెళ్లి రెండు స్టేట్స్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత శివాజీ పలు వేదికల పై మాట్లాడుతూ వస్తున్న కామెంట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌లో శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మెగాస్టార్ తనతో మాట్లాడారట. ఇటీవల విక్టరీ వెంకటేష్ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇండస్ట్రీలోని పలువురు తారలు కూడా విచ్చేసారు. ఈక్రమంలోనే శివాజీ కూడా ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో శివాజీ, చిరంజీవిని కలిసి నమస్కరించగా.. ఆయన బిగ్‌బాస్‌ గురించి మాట్లాడారట.

“నీ కోసం మొన్నటివరకు ఇంటిలో సురేఖ ప్రతిరోజు బిగ్ బాస్ చూసేది. నన్ను చూడమని పిలిచేది” అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి మాట్లాడిన ఆ మాటలు తనకి వచ్చిన పెద్ద కంప్లిమెంట్స్ అని శివాజీ వెల్లడించారు. కాగా శివాజీ.. ఇటవల మెగా ఫ్యామిలీ గురించి పొలిటికల్ గా చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకొచ్చారు.

Also read : Guntur Kaaram : బలుపు అనుకుంటారేమో.. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా.. నిర్మాత కామెంట్స్

ఆ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవ్వరికి లేదని, వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమి కాదని, కానీ ఎక్కడో చిన్నలోపం ఉంది. దాన్ని సరిచేసుకుంటే చాలని ఆయన కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. కాగా శివాజీ.. చిరంజీవి ‘మాస్టర్’ సినిమాతోనే ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత నాగార్జున, వెంకటేష్, పవన్ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసి హీరోగా ఎదిగారు.

ప్రస్తుతం #90’s అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో ‘#90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ ని తెస్తున్నారు. ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. రీసెంట్ గా ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజయింది.