Guntur Kaaram : బలుపు అనుకుంటారేమో.. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా.. నిర్మాత కామెంట్స్

గుంటూరు కారం సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. మీరు బలుపు అనుకుంటారేమో. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా..

Guntur Kaaram : బలుపు అనుకుంటారేమో.. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా.. నిర్మాత కామెంట్స్

Producer Naga Vamsi comments on Mahesh Babu Guntur Kaaram movie

Updated On : December 31, 2023 / 3:19 PM IST

Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

అలాగే మరో పక్క ప్రమోషన్స్ ని కూడా జరుపుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ నుంచి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నిర్మాత నాగవంశీ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ యూట్యూబ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. “మీరు బలుపు అనుకుంటారేమో. కానీ ప్రతి ఏరియాలో గుంటూరు కారం సినిమా రాజమౌళి చిత్రాల నెంబర్స్ కి దగ్గరగా వెళ్ళిపోతుంది. అల వైకుంఠపురములో సినిమా కూడా అలానే వెళ్ళింది” అంటూ వెల్లడించారు. అంతేకాదు ఆ ఇంటర్వ్యూ వీడియోని షేర్ చేస్తూ.. ఒక ట్వీట్ కూడా చేశారు.

Also read : 2023 Small Movies : కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదు.. 2023లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు ఇవే..

“డియర్ సూపర్ ఫ్యాన్స్, మీకు మళ్ళీ స్ట్రాంగ్ గా చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాము. గుంటూరు కారంకి రిలీజ్ రికార్డు స్థాయి థియేటర్స్ లో ఉంటుంది. రిలీజ్ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అంతేకాకుండా మూడు తమిళ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఇన్ని రిలీజ్‌ల్లో గుంటూరు కారం మూవీ ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.