×
Ad

Chiranjeevi – RGV : శివ రీ రిలీజ్ పై చిరంజీవి కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ..

మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. (Chiranjeevi - RGV)

Chiranjeevi - RGV

Chiranjeevi – RGV : ఆర్జీవీ మొదటి సినిమా, నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సూపర్ హిట్ సినిమా ‘శివ’. 1990 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సాంకేతికంగా కూడా ఈ సినిమా అందర్నీ మెప్పించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. శివ సినిమా 35 ఏళ్ళ తర్వాత ఇపుడు రీ రిలీజ్ అవుతుంది. శివ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది.(Chiranjeevi – RGV)

శివ రీ రిలీజ్ సందర్భంగా చాలా మంది హీరోలు, దర్శక నిర్మాతలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ వీడియోలు రిలీజ్ చేసారు. శివ సినిమాతో తమకు ఉన్న అనుబంధం తెలిపారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Buchibabu Sana : డిప్యూటీ సీఎం ఇలాఖాలో.. ‘పెద్ది’ డైరెక్టర్ గృహప్రవేశం.. బుచ్చిబాబు సాన భార్యని చూశారా?

చిరంజీవి శివ సినిమా గురించి మాట్లాడుతూ.. శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు ఒక కొత్త నిర్వచనం. కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. ఇప్పటికి మర్చిపోలేను కల్ట్ షాట్ నాగార్జున సైకిల్ చైన్ లాగడం. నాగార్జున నటనలోని తీవ్రత, ఆ చూపులో తీక్షత, సినిమాలోని నటీనటులు అందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం సంతోషంగా అంది. ఇప్పటి యువత ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అప్పట్లోనే ఇది ఒక కాంటెంపరరీ ఫీలింగా ఎలా తీసారు అని నేర్చుకోవాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ విజన్, అతని సౌండ్ టెక్నీక్స్, కెమెరా షాట్స్ అన్ని కొత్తగా అనిపించాయి. ఆ రోజే ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అనిపించింది. తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ సినిమా చిరంజీవి లా చిరస్థాయిలో ఉంటుంది అని అన్నారు.

ఈ వీడియోని ఆర్జీవీ షేర్ చేసి.. థ్యాంక్యూ చిరంజీవి గారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. గతంలో ఆర్జీవీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై పలు అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ ఎన్ని విమర్శలు చేసినా చిరంజీవి ఇప్పుడు శివ రీ రిలీజ్ కి సపోర్టుగా నిలబడటంతో ఆర్జీవీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో చిరంజీవిని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read : Jayakrishna Ghattamaneni : మహేష్ బాబు కొడుకు హీరోగా సినిమా అనౌన్స్.. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?