Chiranjeevi funny Comment on Ram Charan while Speaking about his Middle Class Things
Chiranjeevi – Ram Charan : తాజాగా చిరంజీవి, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో విజయ్ – చరణ్ కాసేపు స్టేజిపై ఇంటర్వ్యూలాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో విజయ్ తన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇప్పటికి కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు పోలేదని, షాంపూ అయిపోయినా డబ్బాలో నీళ్లు పోసి వాడతానని అన్నాడు. దీనికి చిరంజీవి స్పందిస్తూ ఇప్పటికి తాను చేసే మిడిల్ క్లాస్ పనులు చెప్పుకొచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ.. నువ్వే కాదు, నేను కూడా ఇప్పటికి కొన్ని మిడిల్ క్లాస్ పనులు చేస్తాను. ఇంట్లో లైట్స్ ఆన్ చేసి వదిలేస్తారు. నేనే చూసుకొని ఆఫ్ చేస్తాను. గీజర్ ఆన్ చేసి వదిలేస్తారు. అదీ నేనే ఆఫ్ చేస్తాను. రీసెంట్ గా చరణ్ బ్యాంకాక్ వెళ్తే వాళ్ళ ఫ్లోర్ లో లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మా ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్ నా ఫోన్ కి కనెక్షన్ పెట్టుకున్నాను ఆటోమేటిక్ గా ఆపరేట్ అయ్యేలా. ఓపెన్ చేసి చూస్తే చరణ్ అయిదు లైట్లు ఆన్ చేసి వెళ్లిపోయాడు. చూసుకోరు వెదవలు.. అవన్నీ వేస్ట్ కదా, మళ్ళీ అవన్నీ నా ఫోన్ నుంచి నేనే ఆఫ్ చేసాను. సోప్ అయిపోతుంటే ఇంకో సోప్ కి కలిపి మళ్ళీ వాడతాను. ఇలా చాలా పనులు ఇప్పటికి మనం మానకుండా చేస్తాము. అవి చిన్నప్పట్నుంచి అలవాటుగా మారిపోయాయి అని తెలిపారు.
"చూసుకోరు వెధవలు!" ?? pic.twitter.com/TH8uvStAIc
— Harish R.M (@27stories_) March 31, 2024
ఇలా చిరంజీవి ఇప్పటికి తాను చేసే మిడిల్ క్లాస్ పనులు చెప్తూ, సరదాగా చరణ్ ని వెధవలు అని తిట్టడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.