Mega156 : ఆసుపత్రిలో కేసీఆర్‌కి మెగా156 అప్డేట్ ఇచ్చిన చిరు..

మెగా156 షూటింగ్ లో చిరంజీవి ఎప్పుడు పాల్గొంటారు అనే అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అప్డేట్ ని చిరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ కి తెలియజేశారు.

Mega156 : మెగాస్టార్ చిరంజీవి తన 156 సినిమాని బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభించారు. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. చిరు ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అనే అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అప్డేట్ ని చిరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ కి తెలియజేశారు.

కేసీఆర్ ఇటీవల తన నివాసంలో ప్రమాదానికి గురై హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ని పరామర్శించారు. ఇక హాస్పిటల్ లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్న చిరంజీవిని కేసీఆర్.. సినిమా పరిశ్రమ గురించి ప్రశ్నించారు.

Also read : Animal Collections : బాక్సాఫీస్ పై యానిమల్ పంజా.. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..

“సినిమాలు ఎలా ఆడుతున్నాయి, షూటింగ్స్ జరుగుతున్నాయా..?” అని కేసీఆర్ అడిగిన ప్రశ్నకి చిరు బదులిస్తూ.. “అంతా బాగానే ఉంది. ప్రస్తుతం నేను ఆఫ్ లో ఉన్నాను. జనవరి నెల 15 వరకు కూడా నా షూటింగ్ కి గ్యాప్ ఉంది” అంటూ తెలియజేశారు. దీని బట్టి చూస్తే మెగా156 సంక్రాంతి పండుగా అయిన తరువాత చిరు షూటింగ్ లో పాల్గొన్న బోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అప్డేట్ తో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఒక పేపర్ నెట్టింట లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా కన్ఫార్మ్ అయ్యినట్లు సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు