Ramabanam : చిరంజీవి చెప్పిన మాటలు ఫాలో అయిన గోపీచంద్.. కానీ దర్శకుడు వ్యతిరేకించాడు..

సినీ నిర్మాణంలో అనవసరపు సీన్స్ తీసి ఖర్చు పెంచుతున్నారు అన్న చిరంజీవి మాటలు నిజమనేలా గోపీచంద్ వ్యాఖ్యలు చేశాడు.

Chiranjeevi Gopichand viral comments on Ramabanam director

Ramabanam : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand), డింపుల్ హయాతి (Dimple Hayathi) జంటగా నటించిన సినిమా రామబాణం. డైరెక్టర్ శ్రీవాసు ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. జీరో కట్స్ అండ్ మ్యూట్స్ తో ఈ సినిమా U/A సర్టిఫికెట్ సంపాదించుకోవడంతో ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజతో గోపీచంద్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాడు.

Gopichand : హీరోయిన్ కోసం దర్శకుడిని కాదన్న గోపీచంద్.. ఇంటర్వ్యూలో నిలదీసిన దర్శకుడు..

కాగా రామబాణం సినిమా షూటింగ్ సమయంలో గోపీచంద్, దర్శకుడు శ్రీవాసు మధ్య గొడవ జరిగింది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి డైరెక్టర్ తేజ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. దీనికి గోపీచంద్ బదులిస్తూ.. “సినిమాలో కొన్ని సీన్స్ ల్యాగ్ అవుతున్నట్లు అనిపించింది. ఎడిటింగ్‌ రూమ్ లో ఆ సీన్స్ ని కచ్చితంగా కట్ చేసేస్తారు అనిపించింది. ఆ విషయం గురించి దర్శకుడికి వివరించాను. దానికి శ్రీవాసు.. ఒకవేళ ఆ ఫుటేజీ కావాలంటే అప్పటికప్పుడు రాదు కదా, చిత్రీకరిద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అనవసరమైన సీన్స్ ఎందుకని ఆయనకి చెప్పే ప్రయత్నం చేశాను. ఆయన వినలేదు. తీరా చూస్తే ఆ సీన్స్ ని ఎడిటింగ్‌ లో కట్ చేసేశారు. ఇదే మా మధ్య జరిగింది తప్ప ఎలాంటి గొడవలు లేవు” అంటూ చెప్పుకొచ్చాడు.

SS Chakravarthy : సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

అయితే సినిమా నిర్మాణంలో చోటు చేసుకుంటున్న అనవసరపు సీన్స్ చిత్రీకరణ, దాని వల్ల పెరిగే ఖర్చు గురించి ఇటీవల చిరంజీవి దర్శకులు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు కొరటాల శివని దృష్టిలో పెట్టుకొనే చిరంజీవి చేశాడు అంటూ బాగా వైరల్ అయ్యాయి. కానీ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న సమస్యలు గురించే ఆ వ్యాఖ్యలు చేశాడని ఇలాంటి ఇంటర్వ్యూలు చూసినప్పుడు అర్ధమవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.