Chiranjeevi Interesting comments on Venkatesh at Venky 75 Event
Chiranjeevi : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్(Venkatesh) తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన 75వ మూవీగా ‘సైంధవ్’”(Saindhav) సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి, రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.
ఈ ఈవెంట్ లో అందరూ వెంకటేష్ తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Venkatesh : చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడ్ని.. మెగాస్టార్‌తో సినిమా చేస్తా..
చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వేడుక కూడా అలాంటిదే. నాకు వెంకీతో 40 ఏళ్ళ అనుబంధం ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ లో 1983లో సంఘర్షణ సినిమా చేశాను. అప్పుడే సురేష్ బాబు పరిచయం అయ్యారు. రామానాయుడు గారికి రెండో అబ్బాయి ఉన్నాడని అప్పుడే తెలిసింది. కొన్నాళ్ల తర్వాత అందంగా ఉన్న వెంకటేష్ ని చూశాను. నాలో గుబులు మొదలైంది. ఇతను హీరో అయితే నాకు గట్టి పోటీ వస్తుందని భయపడ్డాను. తనకి సినిమాలపై ఆసక్తి లేదని రామానాయుడు గారు చెప్పాక హమ్మయ్య అనుకున్నాను. రెండేళ్ల తర్వాత వచ్చి వెంకీ సినిమాలు మొదలుపెట్టాడు. అతను పరిచయం అయ్యాక మిత్రులుగా మారి ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. వెంకీ ప్రతి సినిమాకి డిఫరెన్స్ చూపిస్తాడు కథల్లో. అతని సినిమాల్లో మల్లీశ్వరి నాకు చాలా ఇష్టం. వెంకీ అన్ని జానర్స్ చేశాడు. మేము కలిసి సినిమా చేయాలని ఇద్దరి కోరిక. మంచి కథ దొరికితే నా సోదరుడు వెంకీతో కచ్చితంగా సినిమా చేస్తాను. వెంకటేష్ కెరీర్ మాత్రమే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా అందంగా మలుచుకున్నాడు. సంపూర్ణ వ్యక్తిత్వానికి వెంకటేష్ నిర్వచనం అని అన్నారు. ఇక ఈవెంట్లో వెంకీ, చిరు సరదాగా గడిపారు. వీరిద్దరూ ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Mega victory on one frame…?❤️ #Venky75 ! #Chiranjeevi x #Venkatesh pic.twitter.com/QfuLIbVgHp
— Anchor_Karthik (@Karthikk_7) December 27, 2023