Venkatesh : చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడ్ని.. మెగాస్టార్‌తో సినిమా చేస్తా..

వెంకటేష్ తన 75 సినిమాల ప్రయాణం గురించి మాట్లాడుతూ బోల్డన్ని ఆసక్తికర విషయాలని తెలిపి ఎమోషనల్ అయ్యారు.

Venkatesh : చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడ్ని.. మెగాస్టార్‌తో సినిమా చేస్తా..

Venkatesh Comments in his 75th Movie Saindhav Special Event

Updated On : December 28, 2023 / 7:04 AM IST

Venkatesh : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన ల్యాండ్ మార్క్ మూవీగా ‘సైంధవ్‌’(Saindhav) సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి, రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటి చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో వెంకటేష్ తన 75 సినిమాల ప్రయాణం గురించి మాట్లాడుతూ బోల్డన్ని ఆసక్తికర విషయాలని తెలిపి ఎమోషనల్ అయ్యారు. అలాగే వెంకటేష్ కి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే అని తెలిసిందే. దీంతో ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

వెంకటేష్ మాట్లాడుతూ.. మా గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాతో నా ప్రయాణం మొదలైంది. దాసరి, విశ్వనాథ్ గారి లాంటి అగ్ర దర్శకులతో పనిచేసే అదృష్టం దక్కింది. అభిమానులు ఇచ్చిన ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాలు చూడకుండా నా సినిమాలని ఆదరించారు. విక్టరీ, రాజా, పెళ్లి కానీ ప్రసాద్, పెద్దోడు, వెంకీమామ.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు. పిలుపులు మారినా అభిమానుల ప్రేమ మారలేదు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చాను. గతంలో చాలా సార్లు సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే సినిమా మానేసి నేను హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని. ఒకసారి అలాగే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు 9 సంవత్సరాల విరామం నుండి తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150తో బ్లాక్‌బస్టర్‌ను అందించడం చూసి, ఈ నటన కొనసాగాలని నేను తెలుసుకున్నాను. నా తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను అని అన్నారు.

Also Read : Ranbir Kapoor : బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు…ఎందుకంటే…

అలాగే సైంధవ్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. నా 75వ సినిమా సైంధవ్‌ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందర్నీ అలరిస్తుంది. నా ఈ ప్రయాణంలో కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తాను అని అన్నారు. దీంతో వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.