హనుమంతుడిగా చిరంజీవి.. రాముడిగా మహేష్.. హనుమాన్ డైరెక్టర్ కామెంట్స్

జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందంటూ ప్రశాంత్ వర్మ కామెంట్స్.

హనుమంతుడిగా చిరంజీవి.. రాముడిగా మహేష్.. హనుమాన్ డైరెక్టర్ కామెంట్స్

Chiranjeevi Mahesh Babu will be starer in prasanth varma Jai Hanuman movie

Updated On : January 30, 2024 / 5:43 PM IST

Chiranjeevi – Mahesh Babu : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాలో చిరంజీవి, మహేష్ బాబు నటించబోతున్నారా..? దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏమన్నారు..? రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ.. ‘జై హనుమాన్’ అనే సీక్వెల్ ని కూడా ప్రకటించేసారు. ఆ ఎండింగ్ తో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే ఆ సీక్వెల్ లో హనుమాన్ పాత్రని ఎవరు పోషించబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది.

మొదటి పార్ట్ హనుమాన్ పేస్ ని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. హనుమాన్ కళ్ళు చూడడానికి చిరంజీవి కళ్ళులా కనిపించాయని పేర్కొన్నారు. దీంతో ఆ పాత్రని చిరంజీవే చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. అలాగే ఈ సీక్వెల్ లో రాముడి పాత్ర కూడా కనిపించబోతుంది. దీంతో ఈ రెండు గొప్ప పాత్రల్లో కనిపించబోయే నటులు ఎవరని క్యూరియాసిటీ నెలకుంది.

Also read : OG దర్శకుడితో నాని సినిమా.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో..

ఇక ఈ సందేహాలనే రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “హనుమాన్ గా చిరంజీవి కనిపించే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఆయనని మేము మళ్ళీ కలవలేదు. కలిసిన తరువాత క్లారిటీ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇక రాముడి పాత్ర గురించి మాట్లాడుతూ.. “రాముడిగా మహేష్ బాబుని చూడాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ మా ఆఫీస్ లో మహేష్ బాబుని గ్రాఫిక్స్ లో రాముడిగా డిజైన్ చేసి చూసుకున్నాము” అని చెప్పారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒకవేళ మెగాస్టార్, సూపర్ స్టార్ ఈ సినిమా చేయడానికి ఓకే అంటే.. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ అవుతుంది. బాహుబలి రికార్డులు పోయి కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం పక్కా. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.