Chiranjeevi Movie
Chiranjeevi Movie : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, అనేక్ అరంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అసలే ఈ సారి చిరంజీవి 70వ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ గురించి, ఆయన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.(Chiranjeevi Movie)
చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన పుట్టిన రోజు ఆగస్టు 22న రిలీజయిన చిరంజీవి సినిమా ఒకేఒక్కటి ఉంది. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏంటో తెలుసా?
Also See : Megastar Chiarnjeevi : చిరంజీవి బర్త్ డే స్పెషల్.. మెగాస్టార్ రేర్ ఫొటోలు చూశారా?
తన పుట్టిన రోజున రిలీజయిన చిరంజీవి ఏకైక సినిమా చంటబ్బాయి. 1986 ఆగస్టు 22న ఈ సినిమా రిలీజయింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చంటబ్బాయ్ నవల ఆధారంగా దిగ్గజ దర్శకులు జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. డిటెక్టివ్ కామెడీ సస్పెన్స్ జానర్లో ఈ సినిమా తెరకెక్కినది. సుహాసిని హీరోయిన్ గా నటించగా ముచ్చర్ల అరుణ, సుత్తివేలు, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, శ్రీలక్ష్మి, చంద్రమోహన్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా నటించడం గమనార్హం. ఈ సినిమాలో చిరంజీవి జేమ్స్ పాండ్ అని డిటెక్టివ్ గా కనిపించి నవ్వించారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి చార్లీ చాప్లిన్ గెటప్ లో అలరించారు. అయితే ఈ సినిమా రిలీజయినప్పుడు కమర్షియల్ గా యావరేజ్ అనిపించినా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ సినిమాలా నిలిచింది. ఇప్పటికి తెలుగులో డిటెక్టివ్ కామెడీ సినిమాలకు ఆదర్శం చంటబ్బాయ్ అని చాలా మంది హీరోలు, దర్శకులు పలు ఈవెంట్స్ లో, ఇంటర్వ్యూలలో తెలిపారు.